Posts

Showing posts from July, 2024

ద్రాక్షరామ_ప్రాంత_మహిమ💐💐💐

Image
  27 నక్షత్రాలు. 108 పాదాలు ద్వాదశ రాశులుకు ప్రత్యేక దేవాలయాలు ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీ మందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.  ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు. విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలులో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది  గ్రహదోష నివారణ కోసం  అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము,  లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట . మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం. ఓంశనైశ్చ రాయనమః మేష రాశి💐 మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది.   అశ్విని నక్షత్రం పాదం ----------స్థలం --------   దేవీ దేవతల నామాలు మొదటి★---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్న

కలి జన్మ రహస్యం

Image
  నలుగురు అన్న, చెల్లెళ్ళు తప్పు చేస్తే కలి ఉద్భవించింది.  శ్రీ కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన రోజే కలి భూమి మీద ప్రవేశించింది.  బ్రహ్మదేవుని యొక్క వెనకాల భాగం నుంచి స్వీయపాదము అనే శక్తి పుట్టింది. ఆ శక్తికి అధర్ముడు అనే పేరు పెట్టారు. ఆయన భార్య పేరు మిథ్య. ఆమె పిల్లి కళ్ళతో చాలా అందంగ ఉండేది. వీరికి దంభుడు (కపటం) మరియు మాయ అనే కూతురు పుట్టారు. ఈ అన్న, చెల్లెలు ధర్మ విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి లోభుడు (ఆశ) అనే కుమారుడు, నికృతి (కపటం) అనే కుమార్తె పుట్టారు. వీళ్ళు ఇద్దరు కూడా ధర్మం తప్పి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి క్రోధుడు (కోపం) మరియు హింస (వయలెన్స్) అనే కుమార్తె పుట్టారు. వీళ్ళు కూడా ధర్మం తప్పి వివాహం చేసుకున్నారు. వీళ్ళకి కలి పురుషుడు జన్మించాడు. అతను పుట్టిన వెంటనే తన ఎడమ చేతితో తన మర్మ అంగాన్ని, కుడి చేతిలో తన నాలుకని పట్టుకుని వికృతంగా నవ్వాడు.  దీని అర్ధం ‘ప్రతి వారిని కామానికి, రుచులకి, అసత్య, దుష్ పలుకులకి’ బానిసలని చేస్తాను.  కలికి అసంఖ్యాకంగా పుత్రులు, పౌత్రులు పుట్టారు.  పురాణాలలో కలి చెప్పీన విషయాలు  ‘ఈ విశ్వంలో నేను యజ్ఞం, యాగం, ధర్మం, దానం, వ్రతం జరగనీయకు

మనఊరిలో ఉండాల్సిన చెట్లు:

Image
  1)రావి చెట్టు 2) మర్రిచెట్టు II.మనవీధిలో ఉండాల్సిన చెట్లు: 3) వేప చెట్టు 4) బాదం చెట్టు (దేశీ బాదం) III. మనఇంట్లో ఉండాల్సిన చెట్లు: 5) మునగచెట్టు 6)కరివేపాకు 7) ఉసిరి 8) జామ 9) నిమ్మ IV.మనతొట్టిలో ఉండాల్సిన చెట్లు: 10) తులసి 11) అలోవెరా 12) పుదీన 13) కొత్తిమీర 14) రణపాల 15) గోధుమ గడ్డి మన ఇంట్లో చెట్లకి లేదా గోడలకి పాకవలసిన తీగలు: 16) తిప్పతిగా 17) తమలపాకు  భారతీయులారా .... వర్షాకాలం రాబోతుంది  ఈ చెట్లని మన ఉరిలో, వీధిలో, ఇంట్లో ఉండేలాగా ప్రయత్నం చేద్దాం🌱🌱 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక ACCANKSHA YEDUR (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠంలో

Image
  భగవత్  బంధువులందరికీ శ్రీ విధాత పీఠంలో 5-7-2024  (  శుక్రవారం   ) అమావాస్య,   సందర్భంగా నరగోష నివారణార్ధం, అనితర సాధ్యమైన పనులు సుసాధ్యం చేయడంలో అడ్డంకులు తొలగించి విశేష ఫలితాన్నిచ్చే ప్రత్యంగిరా హోమం ప్రతి మాసం లాగే హవనిజా  గారి ఆధ్వర్యంలో జరుగును. మీ మీ గోత్ర నామాలతో పూజ జరిపిం చుకో దలచిన వారు 516/- ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 096666 02371

సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం🌼🌿

Image
  నమస్తే నమస్తే గుహ తారకారే నమస్తే నమస్తే గుహ శక్తిపాణే । నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 1 ॥ నమస్తే నమస్తే గుహ దానవారే నమస్తే నమస్తే గుహ చారుమూర్తే । నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 2 ॥ నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర నమస్తే నమస్తే మయూరాసనస్థ । నమస్తే నమస్తే సరోర్భూత దేవ క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 3 ॥ నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప నమస్తే నమస్తే పరం జ్యోతిరూప । నమస్తే నమస్తే జగం జ్యోతిరూప క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 4 ॥ నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర । నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 5 ॥ నమస్తే నమస్తే గుహ లోకపాల నమస్తే నమస్తే గుహ ధర్మపాల । నమస్తే నమస్తే గుహ సత్యపాల క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 6 ॥ నమస్తే నమస్తే గుహ లోకదీప నమస్తే నమస్తే గుహ బోధరూప । నమస్తే నమస్తే గుహ గానలోల క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 7 ॥ నమస్తే నమస్తే మహాదేవసూనో నమస్తే నమస్తే మహామోహహారిన్ । నమస్తే నమస్తే మహారోగహారిన్ క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 8 ॥ ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రమ్ సర్వేజనా

శ్రీ విధాత పీఠంలో

Image
  శ్రీరస్తు                                                      శుభమస్తు                                                              అవిఘ్నమస్తు                 శ్రీ వారాహీ నవరాత్రులు (06.7.2024 నుండి 15.07.2024 వరకు ) తేదీ   తిథి   వారం   పూజ   ప్రసాదం   06.07.2024   పాడ్యమి   శనివారం    ఇంద్రాణి పాల పాయసం   07.07.2024   విదియ   ఆదివారం    బ్రహ్మి పొంగలి   08.07.2024   తదియ   సోమవారం   వైష్ణవి   కొబ్బరి అన్నం   09.07.2024   చవితి   మంగళవారం   కామేశ్వరి    దద్దోజనం 10.07.2024   పంచమి   బుధవారం   కౌమారీ   పులగం   11.07.2024    షష్టి గురువారం చాముండి   కేసరి

యోగినీ ఏకాదశి

Image
  పాపాలను నశింపజేసే "యోగిని ఏకాదశి" జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వస్తుంది, దీనికి సంబంధించిన గాథను శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించారు. అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది వుండేవాడు!!...      ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు,       కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివున్ని పూజించేవాడు, ఒక రోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళుతాడు, సమయం గడుస్తున్నా అతను రాకపోవడంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ వున్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడు!!...         హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు,            అయితే ఆగ్రహంతో వున్న కుబేరుడు అతడు కుష్టువ్యాధితో బాధపడాలని శాపం పెడుతాడు.         వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు, భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు.  విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకు ఎలా శాపానికి గురైంది వివరిస్తాడు.       తనకు శాపవిముక్తి కలిగించాలని వేడుకుంటాడు,       దీంతో
Image
  * చేతులతో చప్పట్లు కొడుతూ భజన చేయడంలో ఎంత శాస్త్రీయత, ఆరోగ్య రహస్యం ఉందో ఆనాడే మన పూర్వీకులు తెలుసుకుని భజనను మన నిత్యజీవితంలో ఆధ్యాత్మికతో ముడిపెట్టి మనకు వారసత్వంగా అందించారు . . . * మన పూర్వీకులు అందించిన జ్ఞాన సంపదని , సంస్కృతీ సంప్రదాయాల ను మూఢ నమ్మకాలుగా భావించకుండా . . . తెలుసుకుని పాటించండి . .      సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక ACCANKSHA YEDUR (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph: 9666602371

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ............!!

Image
  కృతయుగం నుండి  ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది.  కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం.వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం.  పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు. 1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు. 2. గోవులు విశేషంగా వదింపబడి గో మాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది.  3. వివాహ వ్యవస్థ నిలబడదు 4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు 5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు 6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సర ములకే పడిపోతుంది 7.స్త్రీలు కేశపాశము లు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది 8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే  బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10 వ అవతారంగా వస్తాడు 9. అది ఎప్పుడూ అంటే కల

మిస్టరీ నగరం - శంబాలా నగరం

Image
  కల్కి  సినిమా  నేపధ్యంలో  ఈ  నగరం  మళ్లీ   గుర్తు కు  వచ్చింది ఆ  నగర  విశేషాలు   మిస్టరీ నగరం - శంబాలా నగరం హిమాలయాలు భారత దేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి.  అదే హిమాలయాలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అవి అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి.  ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడువులు ఇంతవరకు ఈ ప్రపంచం లో ని ఏ వ్యక్తి కూడా పూర్తి గా వాటిలో ప్రవేశించ లేక పోయారు వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంగ టనులు జరుగుతాయి అని పెద్ద వాళ్ళు చెబుతారు. అటువంటి వాటిలో చాలా ప్రముఖమైనది "శంబాలా " నగరం.  మన పురాణాలు తెలియచేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో "యతి "రూపం లొ ఉన్నట్టు తెలుస్తుంది.  ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంధాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది.  దాని పేరే " శంబాలా " దీనినే పాశ్చాత్యులు " హిడెన్ సిటీ" అంటారు. ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణం లో ఉన్న హిమాలయాలలొ ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది. అది అందరకి కనిపించదు.  అ