శాకంబరి దేవి ప్రాశస్త్యం

 

అమ్మను చూడటానికి వెయ్యి కళ్ళైనా సరిపోవు, శ్రీ శాకంబరీ దేవి అలంకరణలో మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నిజరూపం

శాకంబరి దేవి ప్రాశస్త్యం

మన సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ పరబ్రహ్మాన్ని స్త్రీగా, అమ్మగా కొలిచే ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఆ మహాశక్తిని ఆషాఢమాసంలో శాకంబరి/శాకంభరి దేవిగా అలంకరిస్తారు

శాకంబరి దేవి గురించి శ్రీ దేవి భాగవతంలో ప్రస్తావించబడింది. శాకంబరీ దేవి ఉత్సవం సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు  పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు

ఇందుకు సంబందించిన పురాణ గాధ తెలుసుకుందాం

వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తి హీనులైపోయారు. నదీ నదాలు ఎండి పోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది

ఋషులు, దేవతలు సర్వ శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవిని ప్రార్ధించారు. అప్పుడు ఆ దేవి కరుణతో “శతాక్షి” గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకం లో వున్న దుస్థితిని  చూసి అమ్మవారి ఒక  కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచం వ్యవధి  పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో  శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు

ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే  ఈ శాకంబరి అవతారం. పార్వతీ దేవి దుర్గగా, తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది

అందరం భక్తితో " ఓం దుర్గాయై నమః " అని వ్రాసి అమ్మ వారి అనుగ్రహం పొందుదాం, ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత


సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

ఏ నక్షత్రం వారు – ఏ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోవాలి?