రామో విగ్రహవాన్ ధర్మః


 

రామో విగ్రహవాన్ ధర్మః

మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది.

ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం.

రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికీ తప్పు కాదు. కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం.

తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్ప లేదు, పెపైచ్చు వెళ్లవద్దని బతిమాలుతున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది!

తండ్రి మరణించాక ‘అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసు కొంటారో చేసుకోండి!’ అని అప్పులవాళ్లను బుకాయిస్తున్న నేటి సంతానం రాముని నుంచి ఎంతో నేర్చుకోవాలి.

తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో చేర్చి వదిలించుకొనే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులనూ, సోదరులనూ తుదముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమ నుంచీ, సోదర ప్రేమ నుంచీ ఎన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి?

వికృత, అసహజ సంబంధాలు అనే భూతం జడలు విప్పి నృత్యం చేస్తున్న               ఈ రోజుల్లో రాముని ధర్మబద్ధమైన వైవాహిక జీవిత నిష్ఠ, ఏక పత్నీవ్రత నియమం, సుందరాంగి తనంత తాను వలచి వచ్చి వరించినా కన్నెత్తైనా  చూడని నిగ్రహ సంపత్తీ నేటి యువతరానికి మార్గదర్శకాలు.

రామకథ ఈనాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యమే, రాముడు నేటికీ మనకు మార్గదర్శకుడే. నాటికీ నేటికీ ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం.

సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం.

జన్మతః రాక్షసుడైనా రామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్నీ, దివ్యత్వాన్నీ సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న ధన్య జీవి.

అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ ‘రామో విగ్రహవాన్ ధర్మః.’ 

మూర్తీభవించిన ధర్మమే రాముడు. ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవత్వానికీ, దివ్యత్వానికీ దర్పణం పడుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special