!!!పురుషులకు ప్రాప్తించే కళత్రదోషం - పరిహారములు!!!
కళత్రం అంటే భార్య అని అర్థం. పురుషుల జన్మకుండలిలో భార్యను గూర్చి తెలియజేసే, ప్రభావితం చేసే గ్రహం శుక్రుడు. శుక్రుడు కళత్ర కారకుడు. పురుషుని జన్మ కుండలిలో సప్తమ స్థానమును కళత్రస్థానం అని పిలుస్తారు. జన్మకుండలిలో సప్తమ భావంలో చెడు గ్రహములు ఉన్నట్లయితే ఆ జాతకులకు కళత్ర దోషం ఏర్పడుతుంది. ఈ కళత్ర దోషం వలన జాతకునికి వివాహం ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా సరైన భార్య దొరకడం దాదాపుగా అసాధ్యం అవుతుంది. ఒక వేళ విధివశాత్తు జాతకునికి వివాహం జరిగినా, వివాహం జరిగిన కొద్ది రోజులలోనే భార్యతో విభేదాలు తలెత్తి విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కళత్ర దోషం ఉన్న దంపతులకు సంసార సుఖం లభించదు. మరి కొందరికి కళత్రదోషం ఉన్నవారి జీవితభాగస్వామికి అనారోగ్యాలు కలుగటంగాని, అకాలమరణం పొందటంగాని జరుగుతాయి.
ఈ కళత్ర దోషం వలన వివాహం ఆలస్యం కావడం, విచారపూరితమైన దాంపత్య జీవితం ఏర్పడటం, దాంపత్య సుఖం లేకపోవటం, భార్యతో విభేదాలు రావటం, భార్యకు దూరంగా ఉండటం, భార్యతో విడిపోవడం, భార్య అకాలమరణం పొందటం లాంటివి జరుగుతాయి.
పురుషుని జన్మకుండలిలో సప్తమస్థానంలో శని ఉంటే జాతకుడికి కళత్రదోషం, శనిదోషం ఏర్పడుతుంది. ఈ శని దోషం వలన జాతకులకు ఆలస్య వివాహం జరగటమే కాకుండ కనీసం 30 సంవత్సరాలు దాటిన తరువాత వివాహం జరిగే అవకాశం ఉంటుంది. శనిదోషముకు తోడుగా శని పై, ఇతర పాపగ్రహవీక్షణ ఉంటే, ఆ జాతకుడు తనకన్నా వయస్సులో పెద్దది అయిన స్త్రీతో వివాహం జరుగుతుంది. ఈ పురుషులకు ఆలస్య వివాహం జరగటమే కాకుండా, భార్య వ్యతిరేకంగా ఉండటం గాని, సంపదలో గాని, సంఘంలో గాని తక్కువ స్థాయిలో ఉండటం జరుగుతుంది.పురుషుని జన్మకుండలిలో రాహు లేదా కేతు సప్తమంలో ఉన్నట్లయితే, జాతకునికి కళత్రదోషం ఏర్పడుతుంది. ఫలితంగా వివాహం జరగటం కష్టం. వివాహం తరువాత వైవాహిక జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. రాహు లేదా కేతు వలన ఏర్పడే కళత్ర దోషముకు నాగదోషం అని కూడా పిలుస్తారు.
పరిహారములు:
ఈ కళత్రదోష నివారణ జరుగుటకు పరిహారములు తప్పనిసరిగా జరిపించుకోవాలి. ఈ హోమములు జరిపించుకోవడం వలన పూర్వజన్మలో చేసిన పాపముల ప్రాయశ్చిత్తము కలిగి, కళత్రదోష నివారణ కలుగుతుంది.
నాగదోష నివారణార్థం,
ఆశ్లేషబలి, నవనాగమండలం, కన్య విమోచన పారాయణ
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
.jpg)
Comments
Post a Comment