జ్యోతిష వివరణలో మూలములు


సంచిత ఆగామి ప్రారబ్ధ ఖర్మలు లో సృష్టి జీవన విధానంలో కొన్ని గ్రహ స్థిత దర్మ అనుసారం జీవి అనేక మజిలీలు జీవన గమనం సాగుతూ కష్ట నష్ట ముల 

వ్యధలు, కావిడ మోతగా సాగే జీవన పయనం లో ఎత్తు పల్లాలు ఒడిదుడుకులు అనేకం జ్యోతిష పరంగా సుఖ దుఃఖ బాదితులు గమనిస్తుంటాము .

రాశి చక్రము  నవాంశ  అరూడము 

శోడశ చక్ర గమనము 

కారకాంశ  స్వాంశ  ఇత్యాది వివరణలో ద్రేఖాన స్థితము రాశి 3బాగములలో గ్రహ స్థితము అంత్య ధ్రేఖాన స్థితగ్రహము ఆత్మ అగుచున్నది  లేదా అధిక డిగ్రీ గ్రహము ఆత్మ కారకుడు

అమాత్య,బ్రాత,మాతృ,పుత్ర,జ్ఞాతి, దార  కారకులు వరుసగా అగు చున్నారు.

 కొన్నిసార్లుఇలాగమనిస్తున్నపుడు వున్న 9 గ్రహాలులో వ్యదా పూరిత గ్రహ దశలులో (బాధక )కొందరు ఆసుఖత కొందరు సుఖ భావన కలిగి కొద్ది రోజులు అటు ఇటుగా సాగే జీవన మజిలీలు గమనిస్తాం.

  రాశులు 12 ద్వాదశ రాశులు లో గ్రహాలు దూమ్ర గ్రహములు రాహు కేతువులు మినహా సప్త గ్రహ పాలనలో జరిగే విపరీతములు కొన్ని సార్లు ప్రమాదములు కొన్ని శుభ పరంపరలలో  సంతోష  సుఖ దుఃఖ బాజితులు అగుచూ నడిచే జీవనము మానవ జీవన చక్రం .

 సమస్త పాణి జంతు కోటి ఈ చక్ర సౌధములో చరించే వారే కదా!

రాశి చక్రములో జీవి 4 అవస్థలు బాల్య యవ్వన కౌమార వార్ధక్య స్థితులు  పరమాయు సంవత్సరములు 120

వింశోత్తరి ద్వారా తెలియచేయును .

మరియు అష్ట యోగినిలు పాలన లో వారి అదృష్ట దురదృష్ట సంకేతము లు ద్వారా ఒక మాయ పొరలో చరిస్తూ నిజమేదో తెలియని భ్రమ ను కలిగి వారి జన్మ సంచిత కర్మ అనుసారమూ జన్మతో తెచ్చుకున్న గత జన్మ  పుణ్య పాప అవశేశము  అనుభవిస్తూ గమనిస్తూ పుణ్య ఫలము శుభ గ్రహములు ద్వారా లేదా కారకత్వ పూర్వ పుణ్య స్థానములు ద్వారా అనుభవము పొందుతూ

కారక పాప గ్రహములు ప్రారబ్ధ కర్మలు అనుభవము  లో అందిస్తూ జరిగే కాల గమనము అష్ట యోగినులు వింశోత్తరి గ్రహ పాలితము లో స్పష్టము గా కాన వచ్చును.

 ఆగామి ఖర్మ పుణ్య ఫలము తోడ్పాటు ద్వారా కొన్ని మహత్తర శుభములుచే  పాప ప్రక్షాళన జరిగి శుభములు పొందుట ఒక అద్భుత ఆవిష్కరణకు మూలము అగును .

కావున జ్యోతిష పరిభాషలో కారకాంశ గత జన్మ సూచనతో స్వాంశ ఆత్మ కదలిక ను గమనిస్తూ జ్యోతిష్య కదలిక ద్వారా జాతకుని చదవడం  ఒక ఉన్నత విద్యా ప్రమాణము గా గుర్తించి ఋషులు ప్రోక్తము ద్వారా ఈ అవగాహన సాధన జ్యోతిష్య మూలమునకు ప్రేరణ అగును.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

ఏ నక్షత్రం వారు – ఏ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోవాలి?

ధన ప్రవాహము-జాతక విశ్లేషణ