???ఆడి కృత్తిక ఎలా జరుపుకోవాలి???
ఆడికృత్తిక 30/7/2024, మంగళవారం, సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైన రోజు
ఆడి కృత్తిక ఎలా జరుపుకోవాలి ?
ఆడి కృతిక సుబ్రహ్మణ్యం స్వామి పండగ ఆ రోజు కావడి తీసే వారు తీస్తారు అలా కావడి ఉత్సవం చేయలేని వారు. ఉదయం తల స్నానం చేసి సుబ్రహ్మణ్యం స్వామి ఫోటో అలంకరణ చేసి, బియ్యం పిండితో దీపాలు వెలిగించాలి పానకం తో పాటు యధాశక్తిన నైవేద్యం సమర్పించి స్వామికి స్త్రోత్రం అష్టోత్తర పారాయణ చేసి స్కంద షష్ఠి కవచం పారాయణ చెయ్యవచ్చు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. అవకాశం ఉన్నవారు ఎవరికైనా ఇంట్లో భోజనం పెడితే మంచిది
సుబ్రహ్మణ్యుని కావడి ఎలా ఎత్తాలి ?
ఇందులో పాల కావడి పళ్ళ కావడి అని ఉంటుంది ముందుగా కావడి కి కావాల్సిన కర్రలు, (తెల్లజిల్లేడు కర్ర, నేరేడు కర్ర, పాల కర్ర ) ఇలా రకరకాలుగా కర్రలు కంటలు కట్టి అమ్ముతుంటారు ఏదైనా కర్ర తీసుకోవాలి కావడి కట్టే బట్టలు ఒక పక్క బుట్టలో స్వామి గుడిలో ఇవ్వాల్సిన పూజ సామానులు నింపుతారు ఇంకో వైపు మూడు రకాల పండ్లు నింపుతారు , పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు, ఇంట్లో పిండి దీపాలు పెట్టి సుబ్రహ్మణ్యం స్వామి కి పూజ చేశాక కావడి అందంగా అలంకారం చేసి పూజ చేస్తారు ఇంట్లో భోజనాలు పెట్టుకుని కావడి భుజాన పెట్టుకుని హరో హర అని భజనలు చేస్తూ తిరుత్తణికి గాని పళణికి గాని వెళ్లి కావడి సమర్పించి వస్తారు. ఈ కావడి కోసం తెచ్చిన కర్ర బట్టలు ముందుగానే నీటితో శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి.ఇందులో మాల వేయడం ఉండదు
ఆడి కృత్తిక రోజున చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు, వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవసించి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరించాలి.ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు
తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు. మా పూర్వీకులు చిత్తూరులో ఉండేవారు కనుక మేము కూడా ఇది తరతరాలుగా ఆచరిస్తున్నాం
అందరం భక్తితో ఓం శం శరవణభవ అని వ్రాస్తూ స్వామివారిని నామస్మరణ చేద్దాం ...
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
.jpg)
.jpg)
Nice
ReplyDelete