కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా???ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే!!!

 



సాధారణంగా మన వస్తువులను సంపదను భద్రపరుచుకోవడానికి ఇల్లు కట్టుకుని దానికి తలుపులు వేయిస్తాం. అయితే ప్రపంచంలో ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్న కేవలం ఒక్క గ్రామంలో మాత్రం ఇళ్ళకు ఎటువంటి తలుపులు ఉండవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. 

అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు చేయించడం లేదు.

ఇది పది, పదిహేనేళ్ల నాటి సంగతి కాదు. కలియుగం మొదటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్లినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. గొళ్లెం, తాళాల ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం ఏమిటి ఎక్కడ ఉంది, దీని విశిష్టతలు తదితర విషయాలకు సంబంధించిన కథనం పాఠకుల కోసం...

1. అనంత స్వరూపడని చెప్పే క్రమంలోనే

మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆ పరమాత్ముడు ఆరుబయటనే ఉంటాడు. ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండక పోవడం ఇక్కడ ఉన్న విశిష్టత. 

తాను అనంతానంత స్వరూపుడనని ప్రజలకు చెప్పే క్రమంలోనే శనీశ్వరుడు తనకు దేవాలయం అవసరం లేదని ఇక్కడి వారికి చెప్పినట్లు స్థానిక కథనం.

2. స్వయంభువుడు.

శని శింగనాపూర్ అనే గ్రామం ప్రసిద్ధ పుణ్యక్షేతమైన షిరిడి నగరానికి మరియు ఔరంగాబాద్ నగరానికి మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడి దైవము "స్వయంభు" అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించినదదని అర్థం. నల్లని, గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియదు. అయినా చాలా కాలం నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడ పూజిస్తున్నారు.

3. పూర్వం ఇది ఒక కుగ్రామం.

పూర్వం శని శింగనాపూర్ ఒక కుగ్రామం. స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపరులు చెప్పే కథనం ప్రకారం... స్వయంభువుడైన శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు. అప్పటి నుంచి ఉన్నాకూడా ఇక్కడ దేవుడికి దేవాలయం లేకపోవడం విశేషం. ఎంత ప్రయత్నించినా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించలేరు.

4. గొర్రెల కాపరి ద్వారా వెలుగులోకి. 

పూర్వం గొర్రెల కాపరి అటు వైపుగా వెళుతూ తన చేతిలో ఉన్న కర్రతో ఈ రాతి పై గట్టిగా మోదాడు. వెంటనే రాతి నుంచి రక్తం స్రవించడం మొదలయ్యింది. వెంటనే అక్కడ ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించింది. ఈ విషయాన్నిగొర్రె కాపరులు దిగ్బ్రాంతితో చూడసాగారు. ఈ విషయం ఆనోటా ఈ నోట గ్రామం మొత్తం చేరిపోయింది. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమికూడింది.

5. కలలో కనిపించాడు

ఆ రోజు రాత్రి శనీశ్వరుడు గొర్రెల కాపరి స్వప్నంలో కనిపించాడు. తాను "శనీశ్వరుడి"నని చెప్పాడు. అద్వితీయముగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని కుడా ఆ గొర్రె కాపరికి చెప్పాడు. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించడమే కాకుండా తన తప్పును క్షమించమని వేడుకొన్నాడు. తన తప్పుకు శిక్షగా తాను స్వామికి ఆలయం నిర్మించి ఇస్తానని ప్రాధేయపడ్డాడు.

6. ఆకాశం మొత్తం తనకు నీడ.

దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడని  చెప్పాడు. తాను సర్వేశ్వరుడినని చెప్పడమే కాకుండా తనకు ఎటువంటి దేవాలయం అవసరం లేదని స్పష్టం చేశాడు. తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పాడు. ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని శనీశ్వరుడు గొర్రెల కాపరికి చెప్పాడు. దీంతో గొర్రెల కాపరి తన ప్రయత్నాన్ని విరమించాడు.

7. దొంగల భయం లేదు

అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసే వారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చాడు. 

అందుచేత  ఈరోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును. ఈ రోజు వరకు ఏ ఇంటికి, దుకాణముకు, ఆలయముకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు.

8. ఇళ్లలతో పాటు దుకాణాలకు కూడా

శనిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శని శింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులే కాకుండా పోలీసు రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి.

9. అలా చేస్తే చనిపోతారు.

ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు కూడా చెబుతున్నారు. ఇలా దొంగతనానికి పాల్పడే వారు ఆరోగ్యంగా ఉన్నా తదుపరి వారం లోపు పేరు తెలియని రోగాలతో బాధపడి చనిపోయారని వారు స్పష్టం చేస్తున్నారు.

10 తైలాభి షేకం

శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగనాపూర్‌ను దర్శిస్తారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.

11. ఒక్క దొంగతనం కూడా జరగలేదు...

2010 వరకూ ఇక్కడ ఒక్క దొంగతనం కూడా జరుగలేదు. అయితే ఆ ఏడాది కొంతమంది ఈ ఊరిలో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే వారు ఊరి పొలిమేర్ల వరకూ వెళ్లగలిగారు. అటు పై ఏదో పెద్ద వెలుగు వారి పైకి వచ్చినట్లు తోచింది. అంతే వారంతా కిందికి పడిపోయారు. వైద్యులు పరీక్షించి వారు చనిపోయినట్లు నిర్థారణ చేశారు.

12. ఒక్క బ్యాంక్ మాత్రమే

ఈ ఘటన జరిగిన తర్వాత యూసీఓ బ్యాంక్ తన కార్యాలయానికి తలుపులు బిగించింది. 

అంతేకాకుండా లాకర్లకు తాళాలు కూడా వేసింది. దీంతో చాలా కాలంగా వస్తున్న సంప్రదాయాన్ని ఆ బ్యాంక్ యాజమాన్యం తోసివేసిందన్న నిరసలు వ్యక్తమయ్యాయి. అయితే బ్యాంకు యాజమాన్యం మాత్రం తన చర్యను సమర్థించుకుంది.

13. బయటి ఊర్లకు వెళ్లినా...

ఇప్పటికీ ఈ శనిశింగనాపూర్ లో ఉన్న దాదాపు 6000 మంది ప్రజలు తమ ఇల్లకు తలుపులు బిగించుకోరు. 24 గంటలూ ఆ ద్వారాలు తెరుచుకోనే ఉంటాయి. ప్రజలు ఎటువంటి భయం లేకుండా ఉంటారు. ఇతర ఊర్లకు వెళ్లే సమయంలో కూడా తమ ఇంటికి గొళ్లెం, తాళాలు వేయరు. తాము ఎక్కడికి ఎన్ని రోజులు వెళ్లినా ఆ శనీశ్వరుడు తమ సంపదను కాపాడుతారని ఇక్కడి వారి నమ్మకం.

 సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025