రేపటి రాశిఫలాలు

 



రేపటి రాశిఫలాలు

శుక్రవారం, జూలై 26, 2024

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఊహించనిరీతిలో మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. స్నేహితుల ద్వారా సహాయసహకారాలు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. కీలక సమాచారంతో కొంత మనశ్శాంతి పొందుతారు. విద్యార్థులకు అవకాశాలపై కొత్త ఆశలు. మహిళలు కుటుంబ సభ్యుల సలహాలను అనుసరించారు.

వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

 ఆదాయం అంతగా కలసిరాక ఏమిచేయలేని స్థితి. ఊహించని విధంగా ప్రయాణాలు.  బంధుమిత్రులతో కొద్దిపాటి మాటపట్టింపులు. కార్యక్రమాలు ఎంతకష్టించినా ముందుకు సాగవు. నిర్ణయాలలో మార్పులు ఉండవచ్చు. ఉద్యోగులకు కొన్ని చికాకులు. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు.  మహిళలు కీలక విషయాలు తెలుసుకుంటారు.

మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

మీ ఆలోచనల పై బంధువుల సానుకూల వైఖరి రావచ్చు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా ప్రగతి సాధించి అప్పులు తీరుస్తారు.  వ్యాపారస్తులు, రాజకీయవేత్తలకు అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరుతాయి.  విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.  మహిళలకు కుటుంబంలో గౌరవమర్యాదలకు లోటురాదు.

కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు. సహనంతో ఎటువంటి కార్యక్రమమైనా పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. బంధువులు, సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  రాబడి మీరు ఆశించినరీతిలో ఉంటుంది.  కాంట్రాక్టర్లు ఆశించిన అవకాశాలు సాధిస్తారు. వ్యాపారస్తులు, రాజకీయవేత్తలకు సంతోషకర సమాచారం. ఉద్యోగుల విధుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు. విద్యార్థులకు శుభవర్తమానాలు రావచ్చు.

సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 వ్యవహారాల్లో మరింత పురోగతి ఉంటుంది. చిన్ననాటి విషయాలు, సంఘటనలు గుర్తుకు వస్తాయి. కుటుంబసమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు.భార్యాభర్తల మధ్య వివాదాలు తొలగుతాయి.రాబడి అనుకున్న విధంగా సమకూరుతుంది.విద్యార్థులు తాము ఊహించని ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది.మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

ప్రయాణాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు.మీ యుక్తి కొన్ని కార్యకలాపాలలో పనిచేయదు. బంధువులతో లేనిపోని తగాదాలు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. స్నేహితులు కూడా మీపట్ల వ్యతిరేక భావంతో ఉంటారు. విద్యార్థులకు లేనిపోని సమస్యలు.ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు, అంచనాలలో పొరపాట్లు.వ్యాపారస్తులు, రాజకీయవేత్తలకు అసంతృప్తి తప్పదు. మహిళలు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి.

తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)ఆర్థిక ఇబ్బందులు సమస్యగా మారతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుంచి కొత్త సమస్యలు.ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు.వివాదాలను పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఉద్యోగులకు విధి నిర్వహణగా మారవచ్చు. వ్యాపారస్తులు, రాజకీయవేత్తలకు లేనిపోని చిక్కులు. విద్యార్థులకు నిరాశ తప్పదు. మహిళలకు బంధువులతో విభేదాలు.

వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. మిత్రులు, సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యంపై కొంత ఆదుర్దా చెందుతారు. ఆదాయం కాస్త తగ్గి రుణయత్నాలు సాగిస్తారు. వ్యాపారస్తులు, రాజకీయవేత్తలు శ్రమపడాలి ఉద్యోగులకు విధుల్లో చికాకులు పెరుగుతాయి.  విద్యార్థులు గందరగోళ పరిస్థితుల మధ్య గడుపుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు

ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.  కార్యక్రమాలలో ఆటంకాలు. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచన ముఖ్యం. బంధువులతో విభేదిస్తారు. కష్టపడ్డా ఫలితంపై నిరాశ చెందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భార్యాభర్తల స్వల్ప అపార్ధాలు. వ్యాపారస్తులకు లావాదేవీలలో చిక్కులు. ఉద్యోగుల తమ బాధ్యత తగ్గించుకునే యత్నం చేస్తారు. విద్యార్థులు ఆశించినదానికి భిన్నంగా జరగవచ్చు. మహిళలకు లేనిపోని సమస్యలు.

మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు. వ్యతిరేక వర్గాలను కూడా కట్టుకుంటారు. ధార్మికవేత్తల ప్రవచనాలు ఆకట్టుకుంటాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది.ఉద్యోగులకు బాధ్యతలు సంతృప్తికరంగా ఉంటాయి.విద్యార్థుల పట్టుదల ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళలకు కీలక సమాచారం.

కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)పూ||భా||1,2,3(సె, సో, ద),

ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చేసే యత్నాలు సఫలం.ఆప్తులు సహాయం అందిస్తారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకునేందుకు యత్నిస్తారు.సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు.ఉద్యోగులు సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.భార్యాభర్తల మధ్య వివాదాలను పరిష్కరించుకుంటారు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.మహిళలకు నూతనోత్సాహం.

మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)

ఆర్థిక లావాదేవీలలో కొంత నిరాశ తప్పదు.  అప్పులు చేస్తారు. వ్యయప్రయాసలతోనే కార్యక్రమాలు పూర్తి చేస్తారు.  ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. కుటుంబ బాధ్యతలు మీకు సవాలుగా మారవచ్చు. బంధువులతో అకారణంగా తగాదాలు.ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు కొందరు దక్కించుకున్నారు.  రాజకీయవేత్తలకు కొన్ని అవకాశాలు ఊహలకే పరిమితం. ఉద్యోగులకు విధి నిర్వహణ పెద్ద సమస్యగా మారవచ్చు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందడం కష్టమే. మహిళలకు కుటుంబంలో లేనిపోని సమస్యలు.

 సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025