చనిపోయినవారు ఎక్కడికి వెళ్తారు ???


చనిపోయినవారు ఎక్కడికి వెళ్తారు ?

 కాశీలో సమస్త విద్యలనూ, శాస్త్రాలనూ అభ్యసించిన మహా పండితుడైన బ్రాహ్మణుడు తన సొంత గ్రామానికి చేరి నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏదో పనిమీద దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళాడు. తిరిగివస్తుండగా పెద్దవాన పడింది. తన వద్ద గొడుగు కూడా లేకపోవడంతో, అతడు దగ్గరలోని ఓ యింటి అరుగుమీదకు వెళ్ళాడు.

 అది ఒక వేశ్యయిల్లు. వర్షం తగ్గగానే ఆ యింటి ముందు నుంచి ఒక మరణించిన వ్యక్తి యొక్క శవాన్ని స్మశానానికి తీసుకెళుతున్నారు.

 ఆ వేశ్య తన కుమార్తెను పిలిచి ఆ చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడో, లేక నరకానికి వెళ్ళాడో తెలుసుకుని రమ్మని పంపింది.

 ఆ మాటలు విన్న పండితుడు ఆశ్చర్యపోయాడు. మరణించివారు ఎక్కడకు వెడతారో, తెలుసుకునే విద్య గురించి తనకు తెలియలేదే!అని చింతించి, ఆ విషయమేమిటో తెలుసుకునేందుకు మరికొంతసేపు అక్కడే ఉండిపోయాడు.

 ఆ అమ్మాయి తిరిగివచ్చి చనిపోయినవ్యక్తి నరకానికి వెళ్ళాడని చెప్పింది. ఇంతలో మరికొందరు యింకో శవాన్ని తీసుకెళ్తుండగా చూసి ఆవేశ్య ఈసారి చనిపోయిన వ్యక్తి ఎక్కడకు వెళ్ళాడో కనుక్కొని రమ్మని కుమార్తెను పంపింది. ఆ అమ్మాయి కనుక్కునివచ్చి ఈ వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడని చెప్పింది.

వాళ్ల మాటలు విని ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు ఎలాగైనా ఈ విద్యను నేర్చుకుని తీరాలని నిశ్చయించుకున్నాడు.

 బ్రాహ్మణుడా యింటి తలుపు తట్టగా వేశ్య తలుపుతీసి “ఎవరు మీరు?” అని అడిగింది.

 ఆ బ్రాహ్మణుడు “అమ్మా! నేను..”అని చెప్తునంతలోనే వేశ్య అతనిని చూసి “నేను వేశ్యను ‘నన్ను అమ్మా!’ అని పిలవవద్దు” అన్నది.

 బ్రాహ్మణుడు “నాకు పరస్త్రీలు అందరూ మాతృసమానులేనని చెప్పి తన సందేహాన్ని నివృత్తి చేయ"మని అడిగాడు.

 వేశ్య - “ఏమిటి మీ సందేహం?”

 బ్రాహ్మణుడు - “తల్లీ! నీవు నీ కుమార్తెను మరణించినవారు ఎక్కడకు వెళ్ళారో తెలుసుకురమ్మని పంపావు. ఆ అమ్మాయి అలానే కనుగొని, “ఒకడు నరకానికి వెళ్ళాడు. ఒకడు స్వర్గానికి వెళ్ళాడు” అని చెప్పింది. ఇదెలా సాధ్యం? చనిపోయినవారు ఎక్కడకు వెళ్ళారో మనకెలా తెలుస్తుంది?” అని ప్రశ్నించాడు.

అప్పుడా వేశ్య తన కుమార్తెను పిలిచి ఈ బ్రాహ్మణునికి సమాధానం చెప్పమన్నది. ఆ అమ్మాయి చెప్పిందిలా:

  ”ముందుగా మొదట మరణించిన ఆయన శవయాత్రలో పాల్గొన్నవారివద్దనుండి అతడు ఏ వీధిలో నివసించేవాడో అడిగి తెలుసుకున్నాను. అతని ఇంటి దగ్గరికి వెళ్లి ఇరుగుపారుగువారి మాటలు విన్నాను. వారంతా యితని మరణానికి ఎంతో ఆనందిస్తున్నారు ’పీడవిరగడయ్యింది. అందరి వస్తువులూ దొంగిలించేవాడు.అందరికి కంటక ప్రాయం గా అందరినీ తిడుతుండేవాడు.అందరి నెత్తిన చేతులు పెట్టి మోసం చేసే వాడు అందరితోనూ దెబ్బలాడేవాడు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అందరినీ ఇరికించేవాడు. అందరినీ కష్టపెట్టేవాడు. వీడు పోవటం వల్ల మన ఇబ్బందులన్నీ తీరినట్లే’పీడ విరగడ అయ్యిన్ది వీడు పోయి అని సంతోషిస్తున్నారు. ఆ మాటలను బట్టి అతడు నరకానికి వెళ్ళాడని అర్థమైంది. అదే చెప్పాను.”అంది.

 ”అలానే రెండవసారి మరణించిన వ్యక్తి చిరునామా తెలుసుకొని, అక్కడకు వెళ్ళగా ఇరుగుపొరుగు వారందరూ బాగా దుఃఖిస్తున్నారు.’అయ్యోరామా! ఎంత విపరీతం జరిగింది? ఈయన అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఎప్పుడూ సాధువులను,ఎవరు ఏ ద్రోహం చేసిన వారికి తిరిగి ఉపకారం చేసేవాడు,మహాత్ములను ఆదరించేవాడు. సత్సంగం చేసేవాడు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆపద ఘటిల్లితే భౌతికంగానూ, ఆర్థికంగానూ సహాయం చేసేవాడు. మానసికధైర్యాన్ని ఇచ్చేవాడు. ఇతడు మరణించడం వల్ల మేమంతా దిక్కులేని వాళ్ళమయ్యాము’ అని విలపిస్తున్నారు. వారి మాటలు విని అతడు స్వర్గానికే వెళ్ళాడని నిశ్చయించాను” అని చెప్పింది.

 ఆ అమ్మాయి మాటలు విని పండితుడు ‘అరరే…! అన్ని ధర్మ గ్రంథాలలోనూ ఈ విషయం చెప్పబడి ఉంది. మంచి పనులు చేసేవారికి సద్గతులు, చెడుపనులు చేసేవారికి దుర్గతులు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్పారు. నేనే ఈ విషయాన్ని విస్మరించాను అనుకున్నాడు.

 ”అష్టాదశ పురాణానాం సారం సారం సముధ్ధృతం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్‌” అనే శ్లోకాన్ని మననం చేసుకుంటూ గృహోన్ముఖుడయ్యాడు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025