***మైసూరు చాముండేశ్వరి జయంతి ***



నేడు మైసూరు చాముండేశ్వరి దేవి జయంతి. మహిషాసురుడు ఘోరతపస్సు చేసి ఎవరివల్ల చావు లేకుండా బ్రహ్మను వరం కోరాడు. అది సాధ్యం కాదని చెప్పగా స్త్రీ అబల కనుక స్త్రీ తప్ప ఇతరులు చేత చావు లేకుండా కోరి వరం పొందాడు. ప్రజాకంటకుడై, దుష్టపాలన చేసే రాక్షసుడు కనుక జగన్మాత చాముండేశ్వరిగా మహిషాసురుని సంహరించింది. ఒడయారు మహారాజుల కులదైవం చాముండి. ఆషాఢమాసంలో దేశమంతటా దేవీ ఆరాధన విశేషంగా జరుగుతుంది. శక్తిపీఠాలలో ఒకటైన మైసూరు చాముండేశ్వరీ అమ్మవారి ఆలయంలో అయితే... ఆషాఢమాసంలోని శుక్రవారాలు, ఆదివారాల్లో భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు. ఆషాఢ బహుళ సప్తమిని చాముండేశ్వరి జయంతిగా భావిస్తారు. ఆరోజున అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. మైసూరు ప్యాలస్ నుంచి పల్లకీని రప్పిస్తారు. రాజదంపతులు,ముఖ్యులు కూడా పల్లకీ సేవలో తప్పకుండా పాల్గొంటారు. చాముండేశ్వరి జయంతిని అక్కడివారు వర్ధంతిగా పిలుస్తుంటారు. ఈ ఉత్సవాలు 19వ శతాబ్దంలో ముమ్మిడి కృష్ణరాజ వడయార్ కాలంలో ప్రారంభమయ్యాయని చెబుతారు. ఆయన ఆషాఢమాసంలోని రేవతీ నక్షత్రంనాడు అమ్మవారి ఆలయానికి ఉత్సవమూర్తిని సమర్పించారు. ఆ ఉత్సవమూర్తినే చాముండీ వర్థంతినాడు పల్లకిలో ఊరేగిస్తారు. ఈ మూర్తినే దసరా ఉత్సవాల్లో స్వర్ణ అంబారీపై ఊరేగిస్తారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025