!!!!శఠగోపం మహిమ !!!!





శ్రీవైష్ణవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు అర్చకస్వాములు తీర్ధం, తులసీ ప్రసాదంగా యిచ్చి అందరి శిరస్సులపై మహావిష్ణువు  పాదుక ముద్రలుండే  శఠగోపాన్ని పెట్టి ఆశీర్వదిస్తారు. 

ముకుళిత సస్తాలతో, శిరస్సు వంచి ఆ శఠగోపాన్ని భక్తితో శిరస్సు పై పెట్టించుకోవాలి, మన తలవ్రాతలని మార్చే శక్తి శఠగోపానికి వున్నది.

మహావిష్ణువు చరణాలను  ఆశ్రయించి శరణు వేడుకుంటున్నాము అంటే మన శిరస్సును ఆయన పాదలపై పెడుతున్నాము అని అర్ధం..

ప్రత్యక్షంగా శ్రీ మహావిష్ణువు పాదాలపై తలపెట్టే మహాద్భాగ్యం ఏ పుణ్యపురుషులకో తప్ప అందరికీ లభించదు. 

కాని భగవంతుని పాదుకల ముద్రలను శఠగోప రూపంలో  పెట్టించుకొని నందువలన మహావిష్ణువు పాదాలే మన శిరస్సుకి తగిలి పాప విముక్తు లవుతున్నామనే పవిత్ర భావన, తృప్తి కలుగుతుంది. 

స్వామి వేదాంత దేశికర్ "పాదుకా సహస్రం" అనే అద్భుతమైన గ్రంధం రచించారు. శ్రీ రంగనాధుని పవిత్రచరణాల మహిమలను తెలిపే గ్రంథం యిది.

వేదాంతదేశికర్ కి   "కవి తార్కిక కేసరి"   అనే బిరుదును లభింప చేసినది యీ గ్రంధం.

ఒకే  రాత్రిలో వ్రాసిన యీ అద్భుత గ్రంధంలో శ్రీ పాదుకల మహిమలే కాకుండా  శ్రీవైష్ణవమత ఔన్నత్యం కూడా  వివరంగా వర్ణించబడినది. 

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025