Posts

Showing posts from October, 2024

మీ సొంతింటి కల నెరవేరాలంటే.?

Image
                                                    గృహ యోగము-స్వంత ఇల్లు. చాలామందికి స్వంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది.ఎంత ప్రయత్నించినా ఇంటిపని పూర్తికాకపోవచ్చు.చేతిలో డబ్బు ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోవడం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది.జాతకంలో  లగ్నం నుండి చతుర్థ భావమనేది జాతకుడు యొక్క ఇంటి విషయాన్ని తెలియజేస్తుంది. జాతకంలో గృహస్థానంలో రవి భగవానుడు ఉన్నప్పుడు ప్రభుత్వ క్వార్టర్స్ లో  వుండవచ్చు లేదా ప్రభుత్వం సహాయంతో ఇల్లు కడుతూ ఉంటారు.చతుర్థ స్థానం లో చంద్రుడు ఉంటే అద్దె ఇంట్లో ఉంటారు లేదా సొంతిల్లు ఉన్నప్పటికీ అద్దె ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు.   కుజుడు ఉంటే వీధిపోట్లు ఉన్న గృహంలో నివసిస్తూ ఉంటారు.చతుర్థ స్థానంలో  బుధుడు ఉన్నప్పుడు అందమైన గృహంలో ఉంటారు.చతుర్థ స్థానంలో  గురుడు ఉన్నప్పుడు   గృహాలు కట్టి అమ్ముతూ ఉంటారు.వ్యాపారం చేస్తుంటారు.అదే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అందమైన రాజప్రాసాదం వంటి ఇంట్లో ఉంటారు.శనిభగవానుడు ఉన్నప్పుడు ఇల్లు కానీ ఇంటి స్థలం గానీ ఉంటుంది కానీ కోర్టులలో  గొడవలు తో ఉంటారు.చతుర్థ స్థానంలో  రాహువు కానీ కేతువు ఉన్న

ఎంత ప్రయత్నించినా వివాహం ఆలస్యం అవుతుందా - పరిహారం

Image
                                                  ఆలస్య వివాహం-పరిహారం జ్యోతిష్య శాస్త్రం అనేది మానవ ప్రయోజనాలకు నిర్దేశించబడినదిగా చెప్పాలి. జాతకరీత్యా వివాహం ఎవరికి ఆలస్యం అవుతుంది అనే విషయం చాలా సార్లు చర్చించడం జరిగింది. పాప గ్రహాలైన రాహువు కేతువు కుజుడు శని భగవానుడు గ్రహాల కారణంగా వివాహం ఆలస్యం అవుతుందని తెలియజేయడం సాధారణ విషయం. ఈ విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. రాహువు కేతువు చాయాగ్రహాలు కుజుడు శని భగవానుడు యుద్ధ గ్రహాలు. ఈ గ్రహాలు కుటుంబ స్థానంలో కానీ వివాహ స్థానంలో కానీ ఉన్నప్పుడు జాతకులకు వివాహంపై చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. సాధారణంగా శని భగవానుడు గాని కుజుడు కానీ కుటుంబ స్థానానికి లేదా వివాహ స్థానానికి సంబంధం ఏర్పడితే వివాహ దశ ప్రారంభ సమయంలో ఒక అవకాశం ఇస్తారు. అమ్మాయిలకు అయితే 19 సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు వరకు అబ్బాయిలకు అయితే 24 సంవత్సరం వయసు వరకు వివాహపరంగా మంచి అవకాశాలు వస్తాయి. కానీ చాలామంది మంచి ఉద్యోగం రావాలి లేదా తను జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి తరువాత వివాహం చేసుకుంటాను అనే ఉద్దేశంతో వివాహ అవకాశాలను వదులుకుంటారు.

సంతానం విషయంలో ఇబ్బందులు తొలగి, సుఖ సంతోషాలతో జీవించలంటే.??

Image
                                                      సంతానము వలన సుఖము తమ పిల్లలు భవిష్యత్తులో తమను ఆదరిస్తారా లేదా అనేది ప్రస్తుత కాలంలో ఒక సమస్యగా ఉంది ఈ సమస్య కోటీశ్వరుల నుండి సాధారణ వ్యక్తుల వరకు కూడా ఉందని చెప్పాలి. తల్లిదండ్రులు సంతానం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు కానీ పిల్లలు తన అవసాన దశలో ఆదరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నది. జాతకంలో ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి, ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉన్నప్పుడు తమ పిల్లలు తమను ఆదరిస్తారు అనేది తెలుసుకోవచ్చు ఈ కారణంగా భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు సరిపడా ధనాన్ని నిలువ ఉంచుకుంటే అది అత్యవసర సమయంలో కాపాడుతుంది. జాతకంలో పుత్ర కారకుడు అయిన గురు భగవానుడు లగ్నంలో కానీ కర్కాటకంలో లేదా ధనుస్సు లేదా మీనం ఈ నాలుగు స్థానాలలో ఏ ఒక్క స్థానంలో అయినా గురుడు స్థితి పొందినట్లయితే మీ పిల్లలు నుండి మీరు ఆదరణ కచ్చితంగా పొందుతారు. లేదా మీ జాతకంలో పంచమాధిపతి శుభగ్రహమైనా లేదా పాప గ్రహమైనా సరే బలంగా ఉండాలి అనగా గురువు యొక్క దృష్టి కానీ గురువుతో కలిసి గానే ఉండాలి. ఈ రెండు నియమాలలో ఏ ఒక్కటి అయినా మీ జాతకంలో ఉన్నప్పుడు మీ సంతానం మిమ్మల్ని

అరసవల్లి లో జరగనున్న అద్భుతం || Arasavalli Temple

Image
                             అరసవల్లి మూలమూర్తిపై కిరణస్పర్శ (3 రోజులు) : మహా భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం అరసవల్లి. ద్వాపరయుగంలో సూర్యుడిక్కడ ఇంద్రప్రతిష్ఠగా వెలిశాడు. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అన్న ప్రమాణాన్ని అనుసరించి.... అరసవల్లి సూర్యనారాయణమూర్తిని అర్చిస్తే నేత్ర, చర్మ వ్యాధులు, ఇతర మొండివ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతారు. ఈ క్షేత్రంలో స్వామిని సేవిస్తే సంతాన, ఆరోగ్య, విద్యా లాభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఏడాదికి రెండు సార్లుస్వామి వారిని స్పృశించే సూర్య కిరణోత్సవం అరసవల్లిఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి సూర్య గమనంలో వచ్చే మార్పుల వల్ల ప్రతిఏటా మార్చి, అక్టోబర్ మాసాల్లో అరసవల్లిస్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు తాకుతాయి. ఇది భారతీయుల వాస్తుశిల్ప విజ్ఞానపు ఔన్నత్యానికి తార్కాణం. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

నవరాత్రి.. మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం.. || Navaratri 2024 First Day

Image
                  నవరాత్రి.. మొదటిరోజు  అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం.. నవరాత్రులలో అతి ముఖ్యమైన రోజు ఆశ్వయుజ మాస శుక్ల పాడ్యమి అయినటువంటి మొట్టమొదట రోజు. ఈరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో కలశస్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్టించి తొమ్మిదిరోజులు ఒక్కొక్క అవతారములో అలంకరణ చేసుకుంటూ ఆరాధన వంటివి ఆచరించినట్లయితే అమ్మ వారి అనుగ్రహం చేత అభీష్టసిద్ధి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని మాతా హవనిజా గారు తెలిపారు. దేవీ నవరాత్రులలో విశేషంగా మొట్టమొదటి రోజు అమ్మవారిని పూజించినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహంచేత అభీష్టసిద్ధి కలుగుతుందని దేవీపురాణం వంటి పురాణాలలో తెలియచేసినట్లుగా చిలకమర్తి తెలిపారు. వసంత బుతువు దేవీ పూజకు ఎంత శ్రేష్టమో, శరదృతువు కూడా అమ్మ ఆరాధనకు అంతే శ్రేష్టం. వేదాలు ఆవిర్భవించక పూర్వం నుందే శ్రీ శక్తిని పూజించే విధానం ఉందని పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తోందని మాతా హవనిజా తెలిపారు. మొదటి రోజు అవతారం: శ్రీ బాల త్రిపురసుందరీదేవి అవతార విశిష్టత దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష పాడ్యమి రోజున శక్తి స్వరూపిణిని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారంలో అలంకరిస్తారు. త్రిపురత్రయం