కేదారేశ్వర వ్రతం - Kedareswara Vratham 2024
కేదారేశ్వర వ్రతం :
కైలాసంలో పార్వతీ సమేతుడై శివుడు కొలువుతీరి ఉన్నప్పుడు భృంగి శివునికి మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. సరసనే ఉన్న పార్వతీదేవి అదేమి? అని అడిగింది. “బ్రహ్మ జ్ఞానులైన వారికి నీతో పని లేదు కనుక నమస్కరించరు” అని భృంగి సమాధానమిచ్చాడు. పార్వతి అలిగి శివుని నుంచి తన శక్తిని ఆకర్షించుకుని, కైలాసాన్ని వదలి గౌతమాశ్రమం చేరుకుంది. శివుడు శక్తిహీనుడయ్యాడు. ఆశ్రమానికి వచ్చిన అమ్మకు గౌతముడు సత్కారాలు చేశాడు. వచ్చిన పని అడిగాడు. “భర్తతోపాటు గౌరవం పొందాలని భార్యకు ఉండటం సహజంకదా! ఆయన భక్తులకు కూడా నాతో పనిలేదట! ఆయనతో పాటు గౌరవం పొందటానికి మార్గమేమిటని” ప్రశ్నించింది. గౌతముడు కేదారేశ్వర వ్రత విధానం తెలియ చేశాడు. పార్వతి నోము నోచింది. ఉద్యాపన నాటికి శివుడు ప్రత్యక్షమై నాడు. “నేను నీకు అర్థ శరీరం కావాలి. నన్ను కూడా గౌరవిస్తేనే నిన్ను గౌరవించినట్టు. ప్రదక్షిణ ఇద్దరికీ చేయాలే కాని మన మధ్య నుండి చేయకూడదు.” అని వరం అడిగింది పార్వతి. సరే నని తన శరీరంలో సగభాగం ఇచ్చి శివుడు అర్థనారీశ్వరుడయ్యాడు. “ఈ కేదారేశ్వరుని వ్రతం చేసినవారందరూ మనలాగే అన్నింటా చెరిసగం ఉండేలా అనుగ్రహించ వలసింది” అని మన కోసం వరం కోరింది పార్వతి. శివుడు అంగీకరించాడు. నందిద్వారా ఈ ఇతివృత్తాన్ని చిత్రాంగదుడనే గంధర్వరాజు విన్నాడు. అతడు వజ్రదంతుడనే రాజుకి ఈ వ్రతాన్ని చెపితే అతడు ఆచరించి, ఉజ్జయినికి రాజయ్యాడు. ఈ కథ స్కాందపురాణంలో ఉంది..
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment