కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది.?? - How Does Karma Works.???
కళ్ళు చెట్టు మీద వున్న పండుని చూశాయి. మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా. అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండును కొయ్యటానికి.
కాళ్ళు పండుని కొయ్యలేవు, చేతులు పండుని కోశాయి. చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది...!!
ఇప్పుడు చూడండి ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు.
ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు.
ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది మరి ఇప్పుడు.
ఎప్పుడైతే తోట మాలి చూసాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి, పాపం వీపు తప్పేమీ లేదు, కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి.
కళ్ళ నుండి, ఎందుకంటే అందరికంటే ముందు, పండుని చూసింది "కళ్ళు".. కాబట్టి.
కర్మ సిద్ధాంతం అంటే ఇదే ఎవ్వరూ దీన్నించి తప్పించు కోలేరు..
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
Comments
Post a Comment