రాహు భగవానుడు-రహస్యాలు - Rahu Secrets | Rahu Remedies | Astro Remedies
రాహు భగవానుడు-రహస్యాలు
రాహు దశలో మంచి ఫలితాలు పొందాలంటే ఏమి చేయాలి అనేది ఈరోజు తెలుసుకోవచ్చు. రాహు దశ 18 సంవత్సరాలు. ముందుగా రాహు ఏ స్థానంలో ఉన్నారు, మరియు ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉన్నారు గమనించాలి ఆ నక్షత్ర అధిపతి ఏ స్థానంలో ఉన్నారో రాహువు ఆ ఫలితాలను ఇస్తారు. రాహు ఉన్న నక్షత్రాధిపతి స్వంత రాశి యొక్క ఫలితాలను కూడా రాహు భగవానుడు ఇస్తారు. రాహు దశలో అంతర్దశ రెండు సంవత్సరాల 8 నెలల 12 రోజులు ఉంటుంది. ఈ సమయంలో జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దశ జరుగుతున్న కాలంలో జాతకుడు చుట్టూ మోసం చేయడానికి అనేకమంది సిద్ధంగా ఉంటారు. వ్యాపారాలు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, ఆర్థికంగా లావాదేవీలు జరిపేవారు అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం భూ సంబంధమైన లిటిగేషన్ వ్యవహారాలు చాలా సమస్యలుగా మారుతాయి. ఈ రాహు భుక్తిలో జాతకుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న జీవిత కాలానికి సరిపడే సమస్యలలో బంధింపబడతారు. ఉదాహరణకు ఇటువంటి సమయంలో ఒక అమ్మాయికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మోసం చేయడానికి అనేకమంది ఈ అమ్మాయి జీవితానికి కనెక్ట్ అవుతారు. ఈ సమయంలో వివాహం చేస్తే ఖచ్చితంగా వివాహం కోలుకోలేని అత్యంత బాధాకరమైన జీవితాన్ని ఇస్తుంది. జాతకంలో రాహువు శుభగ్రహ నక్షత్రాలతో కనెక్ట్ అయినప్పుడు ఈ సమస్య తీవ్రత తగ్గుతుంది కానీ సమస్యలు మాత్రం ఇస్తుంది. అదే రాహువు పాపగ్రహాలతో సంబంధం ఏర్పడినప్పుడు ఆ వివాహం బాధాకరంగా ముగుస్తుంది. రాహు ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు లేదా ఏ నక్షత్రంలో ఉన్నారు గమనించి ఫలితాలను అంచనా వేయవచ్చు.
రాహువు పురుషరాశిలో ఉంటే నాగేశ్వరం నందు స్త్రీ రాశులలో రాహువు ఉంటే కాళహస్తి నందు రాహు కేతు పూజలు జరిపిస్తే రాహు దోషం తగ్గుతుంది.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment