కనకమహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంకోసం
🙏🌺ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే ఓం శ్రీ మాత్రే నమః 🌺🙏
🌺శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం బురుజుపేటలో కొలువు తీరింది పూర్వం ఓపండితుడు కాశీకి చేరుకుని చివరివరకు అక్కడే గడిపి శివసాయుజ్యం పొందాలని బయలుదేరాడు మార్గమధ్యంలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ బావి వద్ద స్నానం ఆచరించాడు బావిలోపల నుంచి ఏదో శబ్దం వినిపించడంతో పండితుడు బావిలో నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వెలుపలకు తీసి ప్రతిష్టించి పూజలు చేసినట్లు కథనం
విశాఖపట్నంలోని బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది ఆలయం చుట్టూ గోడ ఉంది కానీ పైకప్పు లేదు వానకు తడుస్తూ ఆరు బయట అమ్మ కొలువుతీరి ఉంది నడుము పైభాగం వరకు మాత్రమే అంటే చాతి వరకు మాత్రమే అమ్మవారి మూర్తి ఉంటుంది చేతిలో కలువను ధరించి ఉంది భక్తులు అమ్మవారిని స్పర్శించి నమస్కరించుకోవచ్చు ముఖమండపంలో శ్రీ చక్రం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించుకోవచ్చు. 🌺
🌺 ఓం శ్రీ ధనలక్ష్మీ నమో నమః
ధన దేవతా స్తోత్రం
నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణ దాయిని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
ఉద్యతసూర్యప్రకాశ చేఉద్య దాదిత్య మండలే
శివ తత్వ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
విష్ణు రూపి విశ్వమతే విశ్వపాలన కారిణి
మహా సత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే
శివ రూపే శివానంద కారణా నంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే
పంచ తత్వ స్వరూపేచ పంచ శద్వర్ణ దర్శితే
సాధిక అభిష్ట దేవి ధనదాయై నమోస్తుతే🌺
🌺ఇది రోజు పఠించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనందరికీ లభించాలని కోరుకుంటూ ఓం శ్రీ కనకమహాలక్ష్మి దేవి నమో నమః 🌺
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment