వారి వారఫలాలు
.jpg)
వారి వారఫలాలు 30 జూన్ 2024 - 06 జూలై 2024 మేషం🐐 అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ) ముఖ్యమైన విషయాలు సాఫీగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు.విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు.చిరకాల మిత్రులను కలుసుకుని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. ఇంటి నిర్మాణాల పై దృష్టి సారిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.ఆస్తుల క్రయవిక్రయాలు లాభించి లబ్ధి పొందుతారు. కొద్దిపాటి రుగ్మతలు చికాకు పరుస్తాయి.కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలలో మరిన్ని లాభాలు కోసం కృషి చేస్తారు. భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. వృషభం🐂 కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో) ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.ఆప్తుల సలహాలు స్వీకరించి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రత్యర్థులు కూడా అనుకూల...