వారి వారఫలాలు

 



వారి వారఫలాలు 

    30 జూన్ 2024 -  06 జూలై 2024 

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)

 ముఖ్యమైన విషయాలు సాఫీగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు.విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు.చిరకాల మిత్రులను కలుసుకుని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. ఇంటి నిర్మాణాల పై దృష్టి సారిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.ఆస్తుల క్రయవిక్రయాలు లాభించి లబ్ధి పొందుతారు. కొద్దిపాటి రుగ్మతలు చికాకు పరుస్తాయి.కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు.  భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలలో మరిన్ని లాభాలు కోసం కృషి చేస్తారు. భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు.  ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.


వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.ఆప్తుల సలహాలు స్వీకరించి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారతారు. రెండుమూడు విధాలుగా ధనలాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు, షేర్లలో పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. 

 నూతన పెట్టుబడులు సమకూరతాయి.మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. 


మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి.  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు.నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది.ఊహించిన విధంగా సొమ్ము అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరాలకు సోదరులు ఆదుకుంటారు కుటుంబంలోని అందరి ఆమోదంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందుతారు.వ్యాపారాలలో లాభాల బాటలో సాగుతారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. సోదరీలతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గిపోతాయి. మహిళలకు భూ, ఉద్యోగ లాభాలు


కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. 

శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం చాకచక్యంగా దక్కించుకున్నారు. ఆర్థికంగా ఖర్చులు అదుపు చేసుకుంటారు. కుటుంబంలోని అందరిలోనూ మీరంటే ఇష్టం పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.ఆశ్చర్యకరమైన రీతిలో కొంత సొమ్ము సమకూరుతుంది. వ్యాపారాలలో వ్యూహాలు అమలు చేసి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో విధులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఊహించని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మహిళలు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. 


సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా అవలీలగా అధిగమిస్తారు.సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ప్రముఖులు పరిచయమైన మాటసాయం అందిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. రుణ బాధలు తీరతాయి.  ఊహించని రీతిలో మరింత సొమ్ము సమకూరే అవకాశం. బంధువర్గం నుంచి మాటసాయం అందుతుంది. కుటుంబంలో మీ అంచనాలు నిజం కాగలవు. బంధువులు, ఆప్తులతో విభేదాలు. ఆరోగ్యం కొంత చికాకు పర్చినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో భాగస్వాములు చేరి పెట్టుబడులు పెంచుతారు.  లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ప్రశంసలు పొందుతారు. విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు.


కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

కొన్ని పనులు మరింత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.దేవాలయ దర్శనాలు.నిరుద్యోగుల కృషి వృథాగా మారుతుంది. కొంత మానసిక ఆందోళన చెందుతారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణ దాతల నుంచి ఒత్తిళ్లు తప్పవు. కుటుంబపరంగా తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురుకాగలదు.  కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు కొన్ని అపవాదులు తప్పవు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా లభిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం.పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. మహిళలకు మానసిక అశాంతి. 


తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)

సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి.  ఆలోచనలు కలసి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య విషయాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు.భార్యాభర్తల మధ్య సమస్యలు తీరే సమయం.మహిళలు పట్టుదలతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.  ఆకస్మిక ధనలబ్ధి.శుభకార్యాల నిర్వహణ పై ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు.ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లబిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరడంతో పాటు లాభాలు దక్కుతాయి.


వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),

జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నెమ్మదించినా సజావుగా∙పూర్తి చేస్తారు.కొన్ని వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వాతావరణం నెలకొన్న తగాదాలు పరిష్కారం. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. ఆరోగ్యపరంగా గతం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులకు దగ్గరవుతారు.  మహిళలకు ఆస్తి లాభ సూచనలు


ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4

(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

ఆదాయం పెరుగుతుంది.బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు.రుణ బాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు.ఆశ్చర్యకమైన సంఘటనలు ఎదురవుతాయి.వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు అవకాశం.ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.రాజకీయవర్గాల సన్మానాలు. ఐటీ నిపుణుల యత్నాలలో పురోగతి.

విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. మహిళలకు శుభవార్తలు.


మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,

(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

ముఖ్య విషయాలలో విజయం.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది.ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి.  ఆలయాలు సందర్శిస్తారు.  చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారడం విశేషం. రావలసిన డబ్బు అందుతుంది.  రుణాలు సైతం తీరతాయి.  కుటుబంలో ఉత్సాహంగా గడుపుతారు.   మీపై వచ్చిన విమర్శలు, అపోహలు తొలగుతాయి. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. సంతానం వివాహాల పై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు.వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి. విస్తరణ యత్నాలు కలసి వస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.


కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)

పూ||భా||1,2,3(సె, సో, ద),

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలోచనలు అమలుచేసి ముందుకు సాగుతారు. వాహనాలు,ఆభరణాలు కొంటారు. మిత్రుల నుంచి సంతోషంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది.  రుణబాధల నుంచి విముక్తి.  ఆస్తుల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము అందుతుంది. సోదరులు, సోదరీలతో విభేదాలు సద్దుమణుగుతాయి.తండ్రితో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొంత ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది.  అయినా లెక్కచేయక ముందుకు సాగుతారు.ఉద్యోగాలలో కొత్త విధులు మరింత బాధ్యతగా నిర్వర్తించారు. ఒత్తిడులు తొలగుతాయి.రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించే సూచనలు.మహిళలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.


మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),

రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)

ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు.ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. మిత్రులతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. దేవాలయాలు సందర్శిస్తారు.ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. సోదరులు,సోదరీలతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరతాయి.ఊహించని కొంత సొమ్ము అందుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా పొందుతారు.వ్యాపారాలలో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371


Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు