రాశిఫలాలు

 



ఈ రోజుటి రాశిఫలాలు 

      28 JUNE 2024

శుక్రవారము జూన్ 28

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)

 ఆర్థిక లావాదేవీలలో కొన్ని ఇబ్బందులు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.బాధ్యతలు విస్తృతంగా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాల విషయంలో అశ్రద్ధ వద్దు. ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు నిరాశజనకంగా ఉంటుంది.

 ఉద్యోగులకు లేనిపోని సమస్యలు  తెలివిగా వ్యవహరించాలి. మహిళలకు మానసిక అశాంతి

వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసి సంతోషిస్తారు.

 వాహనాలు, స్థలాలు కొంటారు.భార్యాభర్తల మధ్య సయోధ్యకు మార్గం ఏర్పడుతుంది.మీ ప్రతిభను పదిమందిలో చాటుకుంటారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది.

ఉద్యోగులకు చేస్తున్న విధుల్లోనే మరింత అనుకూలస్థితి.మహిళలకు శుభ వర్తమానాలు విద్యార్థులకు విద్యా సాంకేతికవకాశాలు.

మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు వద్దు. కీలక వ్యవహారాలలో ఆటంకాలు. ఒక సమాచారం కొంత గందరగోళం కలిగిస్తుంది. బంధువర్గం నుండి మీపై ఒత్తిళ్లు రావచ్చు.

 ఆరోగ్య నియమాలు పాటించండి.

 ఇంటి కొనుగోలుపై పునరాలోచన. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు స్వల్ప లాభాలు  ఉద్యోగులకు పని ఒత్తిళ్లు పెరుగుతాయి. విద్యార్థులకు కొంతమేర అనుకూల సమయం. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.

సన్నిహితులతో విరోధాలు.శ్రమ తప్ప ఫలితం కనిపించదు, పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలించవు.

అనారోగ్యం, చికాకులు.బంధువుల నుంచి విమర్శిస్తారు. వ్యాపారాలలో కొన్ని సమస్యలుగా మారవచ్చు. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

విద్యార్థులకు అవకాశాలు సంతృప్తినివ్వవు.

మహిళలకు మానసిక ఆందోళన

సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.మీ ఆశయాలు నెరవేరుతాయి. ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత లాభాలు గడిస్తారు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

విదేశీ అవకాశాలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన వార్తలు. మహిళలకు శుభవార్తలు.

కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

ఉద్యోగార్థులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. కార్యక్రమాల సమయానికి పూర్తి చేయడంలో ముందుంటారు.

 సమాజంలో మీరంటే గౌరవం, పలుకుబడి పెరుగుతుంది.

 సన్నిహితులు, శ్రేయోభిలాషులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు.

 ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం పొందుతారు.

 బాధ్యతల విషయంలో రాజీపడరు.

 వాహనాలు, ఆభరణాలు కొంటారు.

 వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వహణలో కొత్త విధానాలు అనుసరించారు.

 మహిళలకు శుభవార్తలు.విద్యార్థులు నూతన విద్యావకాశాలు అందుకుంటారు.ఉద్యోగులకు విధులు సాఫీగా సాగుతాయి. 

 తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)

ఆదాయం అంతగా కనిపించదు. బంధువులతో అభిప్రాయబేధాలు. దూరప్రయాణాలు ఉంటాయి.

 ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. వాహనాల విషయంలో మెలకువగా ఉండండి. ఆలోచనలు నిలకడగా ఉండవు.విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొన్ని వివాదాలు తలనెప్పిగా మారవచ్చు.

 ఉద్యోగులకు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది.

 పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),

జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.ఆస్తి వివాదాలతో సతమతమవుతారు.

 ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

కార్యక్రమాలు కష్టపడ్డా ముందుకు సాగవు.

 ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

 వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. విద్యార్థులకు అవకాశాలపై గందరగోళంగా ఉంటుంది.నిపుణులు సాంకేతిక, పారిశ్రామికవేత్తలకు కొత్త సమస్యలు. మహిళలకు కుటుంబ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు.

ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4

(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు.

 ఎంతగా కష్టించినా కనిపించలేదు. వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.సన్నిహితులతో మాటపట్టింపులు.

 వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.  అప్రమత్తత అవసరం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఒత్తిడులు. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి.మహిళలకు నిరుత్సాహం.

మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,

(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

రావలసిన బాకీలు అందుతాయి. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులకు మీపై అభిమానం పెరుగుతుంది.భార్యాభర్తల మధ్య గొడవలు కొలిక్కి వస్తాయి. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు రాగలవు.ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది.

 వ్యాపార స్తులు, వాణిజ్యవేత్తల కృషి, పట్టుదల లాభాలను నడిపిస్తాయి.ఉద్యోగులకు ఎటువంటి బాధ్యత అప్పగించినా పూర్తి చేస్తారు.మహిళలకు కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది.

విద్యార్థులకు అవకాశాలలో ఆటంకాలు తొలగుతాయి.

 కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)

పూ||భా||1,2,3(సె, సో, ద),

ఆర్థిక పరిస్థితులు నిరాశపరుస్తాయి.బంధువర్గం నుంచి సమస్యలు ఎదురవుతాయి.శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ఆస్తి వివాదాలు తప్పవు.

 అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

 ఇంటాబయటా చికాకులు తప్పవు.

 వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

రాజకీయ,పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి.ఉద్యోగులకు స్థాన చలన సూచనలు.

 విద్యార్థులు అనుకున్నది సాధించడంలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సభ్యుల సహాయం అందదు.

మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),

రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)

రావలసిన బాకీలు అందుకోవడంలో ఆటంకాలు.

 మరో వైపు రుణాలు చేస్తారు. ఇంటాబయట ఒత్తిడులు.ఆలోచనలు నిలకడగా సాగవు.

ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సోదరులతో అకారణంగా విభేదిస్తారు.వ్యాపారులు, వాణిజ్యవేత్తలు స్వీయానుభవాలతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

 ఉద్యోగులు అదనపు విధులు సమస్యగా మారవచ్చు. పారిశ్రామిక,రాజకీయవేత్తల వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు తొందరపాటు నిర్ణయాలు తగదు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు