ఈ రోజు రాశిఫలాలు

 


      23 JUNE 2024

ఆదివారము జూన్ 23

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)

 ఆకస్మిక ప్రయాణాలు.ఆదాయానికి మించి ఖర్చులు ఎదురవుతాయి.

ఆధ్యాత్మిక చింతన. వివాదాలు పరిష్కరించుకునేందుకు యత్నిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు.

తెలిసినవారే సమస్యలు సృష్టిస్తారు.ఎంత కష్టపడ్డా నామమాత్రమే. దూర ప్రయాణాలు ఉండవచ్చు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొన్ని సమసములు తీరుతాయి.

ఉద్యోగులకు పనిఒత్తిడులు .విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.

మహిళలకు మానసిక ఆందోళన

వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

కొత్త వ్యక్తులతో పరిచయాలు.

 దైవకార్యాలలో పాల్గొంటారు.పాత బాకీలు వసూలవుతాయి.

 చిరకాల కోరిక తీరి అందరితో ఆనందాన్ని పంచుకుంటారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

 గౌరవానికి లోటు ఉండదు. భూవివాదాలు తీరి లబ్ధిపొందుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం.ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు.

రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు వివాదాలకు దూరంగా ఉండాలి.విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు.మహిళలకు కొత్త ఉద్యోగావకాశాలు

 మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

ఆనందంగా గడుపుతారు.  కొత్త సామగ్రి కొంటారు.  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.  ప్రతిభ వెలుగులోకి వస్తుంది.  రాబడి సంతృప్తికరం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

ఏ వ్యవహారం చేపట్టినా ఆటంకాలు తప్పవు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో అకారణంగా విభేదాలు. ఎక్కువ శ్రమ ఫలితం అంతగా ఉండదు.

 కుటుంబసభ్యుల నుండి కొన్ని విమర్శలు ఎదురవుతాయి.కొన్ని నిర్ణయాలను తిరిగి మార్చుకుంటారు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో మెలకువ పాటించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు నిదానం అవసరం. ఉద్యోగులకు మరింత పనిఒత్తిళ్లు తప్పవు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం దక్కించుకోలేరు. మహిళలు ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు.

 సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 కొత్త కార్యక్రమాలు చేపడతారు. తీర్థ యాత్రలు చేస్తారు. గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానంపై దృష్టి సారిస్తారు.పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఊహించని రీతిలో సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం.శ్రమ ఫలిస్తుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఇబ్బందులు తొలగుతాయి.

 ఉద్యోగులకు ఏ బాధ్యత అప్పగించినా విజయం సాధిస్తారు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు దక్కించుకుంటారు.

మహిళలకు శుభవార్తలు.

కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

చేపట్టిన కార్యాలు కొంత మందగించవచ్చు.  ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  దూర ప్రయాణాలు.  కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)

శ్రమపడ్డా ఫలితం దక్కుతుంది.  స్థిరాస్తి వివాదాలు పరిష్కారం.  శుభకార్యాలలో పాల్గొంటారు.కొన్ని వ్యవహరాలు పరిష్కారమవుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),

జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

ఆర్థికంగా నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు.కార్యక్రమాలు జరుగుతాయి.

బాధ్యతలతో మరింత ఉక్కిరిబిక్కిరి కాగలరు. మిత్రులు, ఆప్తులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

 వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా కనిపించవు.

 ఉద్యోగులకు ఆకస్మికంగా విధులు మారవచ్చు.

విద్యార్థులకు సమస్యలు చికాకు పెడతాయి.

ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4

(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

కొత్త కార్యక్రమాలు చేపడతారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు.ప్రముఖులతో పరిచయాలు.

మీ ఆశయం నెరవేరుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు.వ్యాపార స్తులు ఆశాజనకమైన కాలం.

 ఉద్యోగులకు విధి నిర్వహణపై నీలినీడలు తొలగుతాయి. రాజకీయవేత్తలు అనుకున్న అవకాశాలు సొంతం చేసుకుంటారు.

 విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. మహిళలకు ఉత్సాహంగా గడుపుతారు.

మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,

(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

కాంట్రాక్టులు దక్కించుకున్నారు.  బంధువులతో ఆనందంగా గడుపుతారు.  ప్రముఖ వ్యక్తులు పరిచయం.  వాహన సౌఖ్యం.  కీలక నిర్ణయాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.

కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)

పూ||భా||1,2,3(సె, సో, ద),

కొత్త రుణాలు చేస్తారు. మిత్రులతో లేనిపోని తగాదాలు.శ్రమ పడ్డా ఆశించిన ఫలితం ఉండదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.భూవివాదాలు మరింత చికాకు పెడతాయి.

 బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు, రాజకీయవేత్తలకు కొంత నిరాశ కలుగుతుంది.ఉద్యోగులకు విధుల్లో వివాదాలు.విద్యార్థుల యత్నాలు ఫలించవు.

మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),

రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)

ఆదాయం మరింత పెరుగుతుంది.సోదరులు, సోదరీల నుంచి శుభవర్తమానాలు.వస్తులాభాలు. అదనపు పనిభారం నుంచి విముక్తి. పాతస్నేహితుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు