తిరుప్పరంకుండ్రం:

చిరకాలంగా వివాహం కుదరని యువతీ యువకులకు… తమిళనాడు రాష్ట్రంలో మదురైనుండి 8 కిలోమీటర్ల దూరంలో ఈ సుబ్రమణ్యేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం ఉంది. కార్తికేయుని 6 దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈఆలయం చిన్న కొండ శిఖరము పై ఉంది. ఆలయం ఎత్తైనగోపురాలతో; విశాలమైన మండపాలతో ఉంటుంది. విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు అని చెబుతారు. ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో స్వామికి వివాహం అయిన స్ధలంగా ఈక్షేత్రం ప్రసిద్దిచెందింది. ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహం కార్తికేయ-దేవసేన వివాహసన్నివేశాన్ని చూపిస్తుంది. ఇంద్రుడు కలశంతో నీళ్ళుపోస్తుఉండగా స్వామి కుడి చేతిని చాచి వుంటాడు. ఎడమవైపున దేవసేన సిగ్గుతో నిలబడి ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళు చాలవు. అంత అందంగా వుంటారు. *చిరకాలంగా వివాహం కుదరని యువతీ యువకులు ఇచ్చట స్వామివారిని దర్శంచి మ్రెుక్కుకుని వివాహం కుదిరిన తర్వాత స్వామి సన్నిధిలో మ్రెుక్కుబడిగా వివాహం చేసుకుంటారు.* ఈ ఆలయంలో మహావిష్ణువు, పరమేశ్వరుడు ఎదురెదురుగా వుంటారు. కార్తీక పౌర్ణమి రోజున కొండపైన కార్తీక దీపం వెలిగిస్తారు.కొండచుట్టు ప్రదక్షిణ చేసి...