పాదాభివందనం వలన… ప్రయోజనం ఏమిటి ?

 

                


శుభకార్యాలలో పెద్దల, ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

కేవలం శుభకార్యాల లోనే కాక పెద్దవారు, కనిపించనప్పుడు, కూడా వారి పాదాలను, తాకుతారు చిన్నవారు.

అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి?

భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను, తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న, పురాతనపద్దతి. అయితే, కొందరు అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.

పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత, ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలున్నాయి.

పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలి. అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.

సాధారణంగా పెద్దవారి, పాదాలు తాకినప్పుడు, వారి,ఆలోచనలు, స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉంటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి.

పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడిచేతిని వారి, ఎడమ కాలిమీద పెట్టాలి.  అలాగే ఎడమచేతిని వారి, కుడి కాలి మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. ఇలా, చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ సమయంలో వారి, శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవ్వుతాయి.

 ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.

పెద్దవారు ఈ భూమి మీద, నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం, వల్ల వారి పాద ధూళిలో, కూడా, ఎంతో జ్ఞానం దాగి, ఉంటుంది. ‘మేము కూడా, మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని,జ్ఞానాన్ని, సంపాదించడానికి, ఆశీర్వదించండి అని, చెప్పే సంప్రదాయానికి, ప్రతీకగా వారి పాదాలను, తాకుతాము.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు