కుమార జననం

 


మహాభారతములో-ఆరణ్యపర్వము

       వశిష్ఠుడు మొదలైన సప్తఋషులు అమావాస్య హోమం చేస్తున్నారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్ని దేవున్ని ఆహ్వానించారు. అగ్నిదేవుడు సర్వాలంకార భూషితలై భర్తల ప్రక్కన సప్త ఋషి పత్నులను చూసి మోహించాడు. వారిని తన జ్వాలలతో తాకాలని ఆరాటపడ్డాడు. హోమం ముగిసింది అగ్ని దేవుడు విరహంతో బాధపడ్డాడు. అగ్ని భార్య స్వాహాదేవి ఇది పసికట్టింది. తన భర్త కోరిక తీర్చడానికి అంగీరసుని భార్య శివ రూపంలో భర్త దగ్గరకు వచ్చి "నేను అంగీరసుని భార్యను. నా తోటి వారైన సప్త ఋషుల భార్యలపై నీకు వలపు ఏర్పడింది మేమంతా నీ కోరిక తీర్చాలనుకున్నాము. నీ మనస్సు తెలుసు కోవడానికి నన్ను పంపారు" అన్నది. అగ్ని దేవుని ఆనందానికి అవధులు లేవు ఆమె యందు తన కోరిక తీర్చుకున్నాడు. స్వాహాదేవి గరుడ పక్షిగా మారి భర్త తేజస్సును వాయువేగంతో వెళ్ళి శ్వేతపర్వతంలో అక్కడ ఉన్న రెల్లు కుండలో దాచింది. ఇలా ఆమె ఆరు రూపాలలో భర్తను కూడి తేజస్సును కుండలో భద్రపరచింది. ఆమె ఒక అరుంధతి రూపం ధరించ లేక పోయింది.    

ఈ విధంగా ఆరు మార్లు కూర్చిన అగ్ని తేజస్సుతో కుమారస్వామి ఆరు ముఖాలతో అగ్ని తేజస్సుతో పన్నెండు చేతులతో జన్మించాడు. శుక్లపక్ష పాడ్యమిలో వీర్య సేకరణ, విదియలో గర్భం ధరించడం, తదియలో రూపం ఏర్పడటం, చవితిలో అన్ని అవయవాలు ఏర్పడి, పంచమి నాడు పూర్తి ఆకారంతో నిలబడి శివుని విల్లు ధరించడం జరిగింది. కుమారస్వామి విల్లు ఎక్కు పెట్టగానే ఆ ధ్వనికి ఐరావతం, సుప్రీతకం అనే ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘించాయి. కుమారస్వామి వాటిని తన చేతులతో అణచి పెట్టాడు. ఒక చేత్తో తనకు సహజసిద్ధంగా లభించిన శక్తి ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఒక చేత్తో వినోదంగా కోడిని పట్టుకుని శంఖం పూరించాడు. బొటన వేలిని చప్పరిస్తూ ఆకాశాన్ని చేతులతో చరిచాడు. ఒక బాణంతో క్రౌంచ పర్వతాన్ని, శక్తి ఆయుధంతో శ్వేతపర్వతాన్ని భేదించాడు. ఆరు ముఖాలతో సింహనాదంచేసాడు. ఆ సింహనాదానికి పర్వతాలు చలించాయి, సముద్రాలు పొంగాయి, భూమి కంపించింది. ఆ ఉత్పాతాలకు భయపడి ఋషులు శాంతి హోమాలు చేసారు. 

అప్పుడు చైత్రరథం అనే అడవిలో ఉన్న జనం "సప్తఋషి పత్నులకు అగ్నిదేవుని వలన జన్మించిన బాలుని వలన ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి" అని ఆక్రోశించారు. ఈ అపనిందని భరించలేక ఋషులు తమ భార్యలను వదిలి వేసారు. కొందరు మాత్రం "ఇందులో ఋషిపత్నుల దోషం ఏమీ లేదు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుని చేరింది" అని చెప్పుకున్నారు. స్వాహాదేవి "అయ్యా! ఈ బాలుడు నాకు నా భర్తకు జన్మించాడు. మీ పత్నులకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. వారిని స్వీకరించండి" అని చెప్పింది. ఋషులు ఆమె మాటలు విశ్వసించ లేదు. తరువాత విశ్వామిత్రుడు అనే ముని అగ్ని కుమారునకు జాతక కర్మలు చేసాడు.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు