లక్ష్మీ స్థానాలు.

 


           గురుభక్తి, దేవభక్తి, మాతాపితృభక్తి కలవారిలో లక్ష్మీకటాక్షం ఉంటుంది.  అతినిద్రలేని వారిలో, ఉత్సాహం, చురుకుదనం ఉన్నవారిలో లక్ష్మీకళ ఉంటుంది.

        శుచి, అతిథిపూజ, ఉల్లాసం ఉన్న ఇంట లక్ష్మీదేవి నివాసం

          ముగ్గు, పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, పాలు లక్ష్మీస్థానాలు.

         దీపం, ధూపం, మంగళద్రవ్యాలు ఆ తల్లికి నివాసాలు.

           పాత్రశుద్ధి, శుభ్రవస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారిచోటు.

            బుద్ధి, ధైర్యం, నీతి, శ్రద్ధ, గౌరవించే స్వభావం, క్షమ, శాంతి - లక్ష్మిని పెంచే శక్తులు.

           సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం. (ఆధారం మహాభారతం)

              అష్టభోగములు : - 1. అన్నము, 2. వస్త్రము, 3. గంధము, 4. పుష్పము, 5. పానుపు, 6. తాంబూలము, 7. స్త్రీ, 8. గానము.

         అష్ట సంపదలు : - (శ్రీ సూక్తం ప్రకారం) :- 1. శిష్యులు, 2. మిత్రులు, 3. పుత్రులు, 4. బంధువులు 5. వాహనములు 6. పనివారు 7. ధన నిల్వలు 8. వస్తు (బంగారం) నిల్వలు.

          లక్ష్మిఎక్కడ ఉంటుంది?  ఎక్కడ ఉండదు?.

       సదాచారం - సత్ప్రవర్తన లక్ష్మీదేవికి ఆహ్వానాలు, లక్ష్మీ అనుగ్రహం లభించాలంటే ఎలా ఉండాలి? అనే విషయమై పురాణాలు, స్మృతులు, తంత్రాలు ఇచ్చిన వివరాలు ఇవి.

         1. దేవతారాధన, శుచి : - శుభ్రత, వేద విహిత, ధర్మపాలన జరిగే ఇళ్ళల్లో లక్ష్మి ఉంటుంది.

        2. ద్వారం, శుభ్రపరచిన ముంగిళ్ళు, గోవులు, పాలు, సాధుస్వభావ స్త్రీలు ఉండే ఇళ్ళల్లో లక్ష్మి ఉంటుంది.

         3. ధనం : - ధాన్యం ఇవన్నీ ''శ్రీ'' రూపాలే! మనల్ని పోషించేదీ  అభివృద్ధికి కారణమయ్యేదీ ఏదైతే ఉందో అదంతా లక్ష్మియే!

          4. ధనాశ లేని యోగులు సాధువులకు వారి యోగశక్తే లక్ష్మి.

       త్రిశక్తులు :-1. మహాకాళి 2. మహాలక్ష్మి 3. మహాసరస్వతి

        పంచ మహాశక్తులు (ప్రధాన శక్తులు) : - 1. దుర్గ (గౌరి) 2. లక్ష్మి 3. సరస్వతి 4. గాయత్రి 5. రాధ

 సప్తమాతృకలు :-1. బ్రాహ్మి 2. వైష్ణవి 3. మాహేశ్వరి 4. కౌమారి 5. ఐంద్రీ 6. వారాహి 7.చాముండా / నారసింహి. 

    "మహర్దశ "

 సువర్ణాభరణాలను ధరిస్తే ఆయుర్వృద్ధి. చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు. ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం. ఎప్పుడూ ఆనందంగా ఉంటే లక్ష్మీప్రదం. పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం. ఒకరికి సహాయపడితే క్షేమం. తృప్తి వుంటే నిత్య యవ్వనం. నవ్వుతూ వుంటే దివ్య సౌందర్యం. మధురంగా మాట్లాడితే మంగళకరం. మితంగా భుజిస్తే చక్కని రూపం.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు