శ్రీమద్రామాయణము

 


"" ఆత్మానం మానుషం  మన్యే ""

(నేను మానవ మాతృడనే).

ఈ మాటలు స్వయముగ శ్రీరామచంద్ర ప్రభువే చెప్పి యండెను.

అంత మాత్రమున ఆయన నిజముగ మానవ మాతృడేనా ? అనే సందేహము కలుగ వచ్చు.

 కారణం.సీతామాత అపహరణ తర్వాత వారు బేలగా సూర్యభగవానునుతో ఇట్లా ప్రాధేయ పడతారు.

"" ఆదిత్య! భో లోకకృతాకతఙ్ఞ

         లోకస్య సత్యానృతకర్మసాక్షిన్,

మమ ప్రియా సా క్వ గతా హృతా వా

శంసస్వ మే శోకవశస్య  నిత్యమ్.(అరణ్యకాండ 63వసర్గ,16వశ్లో),

ఓ సూర్యా, నీవు కర్మ సాక్షివి.లోకమున జరిగే మంచి చెడులు అన్నీ నీకు తెలుసు.నాకు ప్రియమైన సీతను గురించి శోకమగ్నుడనైన నాకు చెప్పవయ్యా.అని ప్రాధేయ పడటము చూస్తే రాముడు మానవ మాతృడే అని నిర్ధారణ అవుతున్నది.

కానీ ,సీతామాతని రక్షించటములో మృత్యువాత పడ్డ జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసిన శ్రీరాముడు జటాయువుకి పునర్జన్మలేని ఉత్తమలోకములు ప్రసాదించినట్లు తెలుస్తుంది

"" మయా త్వం సమనుజ్ఞాతొ గచ్ఛ లోకాననుత్తమాన్,

గృధరాజ! మహాసత్వ! సంస్కృతశ్చ మయా వ్రజ""

(అరణ్యకాండ-68వసర్గ-30వశ్లో)

శ్లోకాన్ని గమనిస్తే శ్రీరాముడు మానవమాతృడు అయితే జటాయువుకి మోక్షాన్ని ప్రసాదించే అవకాశము ఉండదుకదా!

మానవ అవతారములో మానవమాత్రుడిగ మెసిలిన అవతారమని శ్రీరాముని గమనించుకోవాలి.ఇవన్నీ నిత్య పారాయణములో మనకి అవగతమవుతాయని గ్రహించుకోగలగాలి.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు