భూతప్రేతపిశాచాది బాధలు తొలగుటకు, రోగములు మరియు ఎటువంటి కష్టములైనా తొలగుటకు, అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు సుప్రసిద్ధములు. దేవాలయమునందు కానీ లేదా హనుమంతుని యంత్రమును గాని, హనుమత్ విగ్రహమును లేదా పటమునైనా ఇంటివద్ద పెట్టుకొని ప్రదక్షిణము చేయవచ్చు. పుష్పాదికమును, వక్కలను, పసుపుకొమ్ములను గణనకు తీసుకొని గణన చేయడం శ్రేష్ఠం.

శ్రీహనుమాన్ జయహనుమాన్ జయజయ హనుమాన్! ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం! తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం!! మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన! శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో!!

అని పఠిస్తూ ప్రదక్షిణములు చేయవలెను. భక్తి శ్రద్ధలతో చేతులు జోడించుకొని, పరుగులిడక నమ్రులై ప్రదక్షిణము చేయాలి. మధ్యలో మాట్లాడరాదు. స్నానాదికములు నిర్వహించి శుచులై చేయవలెను. 108 కానీ, అందులో సగము కానీ లేదా 5 కానీ, దీనితో గుణించబడిన సంఖ్యతో కానీ చేయవచ్చు. నిండుచూలాలు నడుచునట్లు ప్రదక్షిణ చేయాలి. ఈవిధంగా ప్రదక్షిణలు చేసిన వారికి హనుమంతుడు అనుగ్రహించి కోరికలు తీర్చుతాడు.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు