శంకరుడి స్తోత్రం || ఆనందానికి మూలమైన శంకరుని స్తోత్రం..!!

శంకరుడి స్తోత్రం || ఆనందానికి మూలమైన శంకరుని స్తోత్రం..!! వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం తాత్పర్యము: ఆనందానికి మూలము (శంభు), ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవ గణములకు అధిపతి (పశుపతి), సూర్య చంద్రులు, అగ్ని మూడు నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు. జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371