పెళ్లి లేట్ అవుతుందా.? / పెళ్లి సంబంధాలు చూసి చూసి విసిగిపోయి ఉన్నారా.?? / Remedy For Late Marriage


                                 వివాహం జరగటంలేదా.? ఇలా చేయండి.. మీ సమస్యకి పరిష్కారం..!!

ఆలస్య వివాహం-పరిహారం

జ్యోతిష్య శాస్త్రం అనేది మానవ ప్రయోజనాలకు నిర్దేశించబడినదిగా చెప్పాలి. జాతకరీత్యా వివాహం ఎవరికి ఆలస్యం అవుతుంది అనే విషయం చాలా సార్లు చర్చించడం జరిగింది. పాప గ్రహాలైన రాహువు కేతువు కుజుడు శని భగవానుడు గ్రహాల కారణంగా వివాహం ఆలస్యం అవుతుందని తెలియజేయడం సాధారణ విషయం. ఈ విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. రాహువు కేతువు చాయాగ్రహాలు కుజుడు శని భగవానుడు యుద్ధ గ్రహాలు. ఈ గ్రహాలు కుటుంబ స్థానంలో కానీ వివాహ స్థానంలో కానీ ఉన్నప్పుడు జాతకులకు వివాహంపై చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. సాధారణంగా శని భగవానుడు గాని కుజుడు కానీ కుటుంబ స్థానానికి లేదా వివాహ స్థానానికి సంబంధం ఏర్పడితే వివాహ దశ ప్రారంభ సమయంలో ఒక అవకాశం ఇస్తారు. అమ్మాయిలకు అయితే 19 సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు వరకు అబ్బాయిలకు అయితే 24 సంవత్సరం వయసు వరకు వివాహపరంగా మంచి అవకాశాలు వస్తాయి. కానీ చాలామంది మంచి ఉద్యోగం రావాలి లేదా తను జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి తరువాత వివాహం చేసుకుంటాను అనే ఉద్దేశంతో వివాహ అవకాశాలను వదులుకుంటారు. శని భగవానుడు కుజుడు రాహువు కేతువు కుటుంబ లేదా వివాహ స్థానానికి సంబంధం ఏర్పడినప్పుడు ఇటువంటి జాతకులు తక్కువ వయసులోనే వివాహం చేసుకోవడం చాలా మంచిది. ఇటువంటి జాతకులు వివాహం ఆలస్యం చేస్తే సుమారుగా 32 సంవత్సరాల వయసు వచ్చేవరకు వివాహం జరగడం చాలా కష్టం అవుతుంది. వివాహం జరిగినప్పటికీ చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. వీరు ఊహించిన దానికి భిన్నంగా జీవిత భాగస్వామి ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకు లగ్నంలో రాహు సప్తమంలో కేతువు ఉన్నప్పుడు వీళ్ళు జీవిత భాగస్వామి యొక్క కోరికలు తీర్చలేకుండా ఉంటారు దీనివలన విభేదాలు ఏర్పడతాయి. అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్న శని భగవానుడు ఆలోచనలు లేని అర్థం చేసుకోలేని జీవిత భాగస్వామిని ఇస్తారు దీని వలన వివాహ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. కష్టపడి డబ్బు సంపాదించాలనే కోరిక తప్ప జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచాలి అనే ఆలోచన వీరికి రాదు. సప్తమ స్థానంలో కుజభగవానుడు ఉన్నప్పుడు మీపై పెత్తనం చెలాయించి మిమ్మలను అణిచివేసే జీవిత భాగస్వామి వచ్చే విధంగా ఉంటుంది. సప్తమ స్థానంలో రాహువు ఉన్నప్పుడు ఊరిలోఉన్న సమస్యలన్నీ ఇంటికి తీసుకువచ్చి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసే జీవిత భాగస్వామి వస్తారు. ఇటువంటి జాతకులు ఆలస్యంగా వివాహం చేసుకోకపోవడం మంచిది. వివాహ సమయంలో దశాభుక్తులను కూడా పరిశీలించాలి. వివాహ సమయంలో యోగ దశ నడుస్తుందా లేదా పాపగ్రహ దశ నడుస్తుందా అనే విషయంపై ఆధారపడి నూటికి నూరు శాతం ఫలితాలు వస్తాయి. ఆలస్య వివాహం కూడా కొంతమందికి జీవితంలో సక్సెస్ ఇస్తుంది . ఎలా అంటే సప్తమాధిపతి నీచబడిన, అస్తంగత్వం చెందిన, పాపగ్రహాలతో కలిసిన లేదా 3 9 11 స్థానాధిపతులు అత్యధిక బలం పొందిన జాతకులు ఆలస్య వివాహం చేసుకున్నప్పటికీ వివాహంలో సమస్యలు రావు. కర్మానుసారం ఏ విధంగా రాసి పెడితే ఆ విధంగా జరుగుతుంది అని అనుకున్నప్పటికీ ఏ సమయంలో ఏమి చేయాలి అనేది తెలుసుకుని పని చేస్తే  ఫలితాలు అనుకూలంగా మారతాయి.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును. 

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025