దేవీ నవరాత్రులు పూర్తి సమాచారం - దేవీ నవరాత్రులు 2024 || Devi Navaratri 2024


 


దేవీ నవరాత్రులు వొచ్చే నెల అక్టోబర్ 03 గురువారం మొదలై,,అక్టోబర్ 12 శనివారం విజయ దశమి వేడుకతో ముగుస్తుంది..


కలశస్థాపన సమయం ఉదయం 4:16 ని॥ లకు ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోతే,,8 గంటల లోపు కలశ స్థాపన చేయాలి..అపుడే ఆఖండ దీపం కూడా పెట్టు కోవాలి..


అమ్మను 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయడం ఉత్తమము,,ఉన్న వాటి తోనే పూజించుకొండి..ఫలములు,,పువ్వులు,,పాలు కూడా అమ్మకి చాలా ఇష్టం,,ఉన్నదాంట్లో ప్రధానమైనది శుభ్రత సమయానికి స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి దీపారాధన చేసుకొని అమ్మవారి సోత్రాలను పారాయణం చేసుకోండి..


అమ్మవారి అలంకరణలు 3 to 12..


3, బాల త్రిపుర సుందరీ దేవి గులాబీ రంగు పాయసం.. 

4, గాయత్రిదేవి ఎరుపు దద్దోజనం..

5, అన్నపూర్ణదేవి పసుపు పరమన్నం..

6, లలితదేవి చిత్రవర్ణము చిత్రాన్నము..

7, మహా చండి ఎరుపు పాయసం,గారెలు..

8, లక్ష్మిదేవి ఆకుపచ్చ చక్కెర పొంగలి..

9, సరస్వతిదేవి తెలుపు పెరుగన్నం..

10, దుర్గాదేవి చిత్రవర్ణము పులిహోర,వడలు..

11, మహిషాసుర మర్దిని చింతపిక్క రంగు గారెలు,పరమన్నం..

12, రాజరాజేశ్వరి దేవి రాణిరంగు పూర్ణములు


10 రోజులు అలంకరణ అనేది వారి వారి యొక్క స్తోమతను బట్టి చేసుకోవచ్చు,,అమ్మవారికి నైవేద్యాల విషయంలో కూడా ఎవరి ఇష్టం వాళ్ళది,,రంగులు విషయంలో కూడా ఎవరు ఇష్టం వాళ్ళది,,పువ్వులు కూడా ఎంచకూడదు ఎవరి ఇష్టం వాళ్ళది,,(ప్రతి పువ్వు అమ్మని పూజించే పుష్పమే)


మొదటి మూడు రోజులు,,లేకపోతే మూలా నక్షత్రం నుంచి సరస్వతి అలంకారం నుంచి తర్వాత మూడు రోజులు చేసుకోవచ్చు,,ఒకవేళ అది కుదరని వారు చివరి రోజు విజయదశమినాడు కూడా చేసుకోవచ్చు..


తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టాలా అని అడుగుతున్నారు..

మనస్ఫూర్తిగా ఏం పెట్టిన అమ్మ స్వీకరిస్తుంది ప్రధానమైనది భక్తి,ప్రేమ,,చక్కగా తొమ్మిది రోజులు పానకం, వడపప్పు,చలిమిడి అనేది నివేదన చేయడం చాలా విశేషం,,అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది నివేదన చేయడం వల్ల సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది..


చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే,, అఖండ దీపం తప్పకుండా పెట్టాలా?? పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు,,ఉదయం సాయంత్రం దీపారాధన అయితే చేసుకోవచ్చు. అదే విధంగా కలశ స్థాపన కూడా పెట్టుకోవాలా? కలశం పెట్టుకోవాలి అనేది ఏమీ లేదు ముందుగా భక్తి భావన అనేది ప్రధానం,,భక్తిశ్రద్ధలతో చేయడం చాలా విశేషం,,ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి యొక్క స్తోత్రాలు,,స్తోత్ర పారాయణం లేకపోతే అష్టోత్తర శతనామావళి అలాంటివి పారాయణం చేయడం వల్ల,,చాలా విశేషమైన ఫలితం..


మీకు కుదిరితే దుర్గా దేవి యొక్క చిత్రపటానికి పూజించు కోండి కుదరని పక్షంలో మీ ఇంట్లో ఏ అమ్మవారి చిత్రపటం ఉంటుందో ఆ అమ్మకి మీరు పూజని సమర్పించుకోవచ్చు..ఒకవేళ మధ్యలో నెలసరి వస్తే?ఆ నాలుగు రోజులు కూడా దీపము ఇంట్లో ఇంకా ఎవరైనా సరే వెలిగించవచ్చు..


ఒకవేళ మధ్యలో వస్తుందేమో అని ముందే మీరు దయచేసి నవరాత్రులను ఆపేయకండి,, మీ పూజ మీరు ప్రారంభించండి సంతోషంగా చేసుకోండి,,ఒకవేళ మధ్యలో ఇలాంటి ఇబ్బంది ఏమన్నా వస్తే,,ఇంట్లో ఇంకెవరితో అన్న పిల్లల అన్న సరే చక్కగా దీపం పెట్టుకోవచ్చు,,మీరు అమ్మ నామాన్ని స్మరించుకోండి..


విజయదశమి అంటే దసరా రోజు తప్పకుండా అమ్మవారికి పూర్ణాలు తప్పనిసరిగా సమర్పించాలి,,ఎందుకంటే ఉద్యాపన ఇచ్చే సమయంలో పూర్ణాలు సమర్పించడం వల్ల ఆ ఉద్యాపన అనేది పూర్తవుతుంది,,సంపూర్ణమైనట్లుగా తెలియ జేసేది పూర్ణాలు కాబట్టి పూర్ణాలు అమ్మవారికి సమర్పించుకోవాలి..విజయదశమినాడు సాయంత్రం తప్పకుండా సెమీ పూజ అంటే జమ్మి చెట్టుకు పూజ చేసుకోవాలి,,తర్వాత రోజు ఉదయం నిత్య పూజ అనంతరం అమ్మవారికి ఉద్యాపన చెప్పు కోవాలి.. 


(కుదిరితే జమ్మి చెట్టు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఆరోజు సాయంత్రం పూజ చేసుకోండి ఒకవేళ జమ్మి చెట్టు దొరకని వారు కొమ్మ దొరికినా సరే మీరు పెట్టి పూజించుకోవచ్చు అది కుదరని వారు చిత్రపటం కైనా సరే నమస్కరించుకుని పూజ చేసుకోవచ్చు..భావన ముఖ్యం)


జమ్మి చెట్టు మంత్రం..

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా తత్ర నిర్విఘ్న కర్రీత్వం భవ శ్రీరామపూజితే


ఈ మంత్రాన్ని ఆ రోజు 9సార్లు చదువుకోండి,,ఇంట్లో జమ్మిచెట్టు ఉంచుకోవచ్చా సంతోషంగా పెంచుకోవచ్చు..


ఉద్యాపన అంటే ఏంటి పది రోజులు అమ్మని పూజించుకునేకా ఆమెను యథాస్థానంలోకి పెట్టుకోవడం అంటే కలశం లేదా చిత్రపటం ఒక మూడుసార్లు కదపడం..


పాటించాల్సిన నియమాలు..

మీ ఆరోగ్య రీత్యా కుదిరితేనే నేలపైన కూర్చోడం,,నేలపైన పడుకోవడం,,మాంసాహారాన్ని తినకూడదు( ఒకవేళ నాకు ఇంట్లో ఒప్పుకోరు నేను వంట చేయాలి ఎలా పర్వాలేదు మీరు తినకండి ఇంట్లో వాళ్లకి వండి పెట్టండి అది కూడా తప్పని పరిస్థితుల్లోనే),,బ్రహ్మచర్యం పాటించాలి( ఒకవేళ నా భర్త ఒప్పుకోరు ఎలా ఇబ్బంది పడకండి ఇబ్బంది పెట్టకండి అన్ని అమ్మకి తెలుసు) నిత్యం అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉండాలి,,ఒకవేళ ఆఫీస్ లో ఉంటే ఎలా అని అడుగుతున్నారు అప్పుడు మీరు మీ కాళ్లకున్న చెప్పలని తీసేసి అమ్మ నామాన్ని స్మరించుకోవొచ్చు,, సోత్ర పారాయణం కూడా చేసుకోవచ్చు..


లేనిపోని సందేహాలను మనసులో నుంచి ముందు తీసేయండి,,ఆమె మన అందరికీ అమ్మ,,అమ్మకి ఇష్టమైన రోజులు అవి కూడా మామూలు రోజులు కాదు,,చాలా అంటే చాలా చాలా విశేషమైన రోజులు కాబట్టి మీకు కుదిరిన దాంట్లో మీరు చెయ్యగలను అనుకున్న దాంట్లో సంతోషంగా పూజ చేసుకోండి అమ్మకి..అది తప్ప ఇది తప్ప అనుకుంటూ సందేహాలతో మనసుని నిప్పెయకండి.. 


ఊరికే అమ్మని చూసి భయపడకండి,,అంత పెద్ద పెద్ద తప్పులు మనమేం చేసేయడం లేదు,,కలి ప్రభావంతో బాధింప పడుతున్నాము,,మమ్మల్ని రక్షించు అమ్మ అని చెప్పి అమ్మని వేడుకుంటున్నాం..కాబట్టి మీకు ఉన్న దాంట్లో ఆనందంగా సంతోషంగా అమ్మకి మీ చేతుల మీద పూజని అందించండి తప్పకుండా ప్రతి ఒక్కలు కూడా మీ ఇంట్లో నవరాత్రులు పండగ చేసుకోండి..అమ్మ చాలా మంచిది,,మీ కుటుంబానికి రక్షణాల ఉంటుంది..గట్టిగా చెప్పండి అమ్మకి నేను చేస్తాను అమ్మ అని,,ఇంకా అమ్మనే చేయించుకుంటుంది..🙏🏻🙆🏻‍♀️🙋🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🪷🪷🪷

జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.