కస్థానికి తగ్గ ఫలితం రావటంలేదా.? / Horoscope Analysis ఇన్ Telugu

                          జీవితంలో అభివృద్ధి లేకపోవడం-జ్యోతిష్య విశ్లేషణ


జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ అభివృద్ధి లేకపోవడం అనేది జాతకంలో కొన్ని పాప గ్రహాల కలయిక ఒక రాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. కొందరు ఉన్నత కుటుంబాలలో జన్మించినప్పటికీ కాలక్రమమైన సాధారణ జీవితం గడపాల్సి వస్తుంది. మరికొందరు ఎంతకాలం కష్టపడినప్పటికీ జీవితకాలం సాధారణ జీవితాన్ని గడుపుతారు. పూర్వజన్మ కర్మ ఫలితం అనేది ఈ జన్మకు సంప్రాప్తి చెందడం వలన ఈ దోషం ఏర్పడుతుంది. ముఖ్యంగా కర్మ కారకుడు శని భగవానుడు పూర్వజన్మ కర్మలను పుణ్యం అయినా పాపం అయినా ఈ జన్మకు తీసుకొచ్చేవారు శని భగవానుడు. శని భగవానుడు రాహు తో కలిసి కొన్ని రాశులలో ఉన్నప్పుడు జాతకుడు ఎంత కష్టపడినప్పటికీ జీవితంలో ఏదీ సాధించలేడు. శని భగవానుడు రాహువు కలిసి ఉన్నప్పుడు. జాతకుడికి అనేక అడ్డంకులు సమస్యలు ఏర్పడతాయి మాంత్రిక సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు, ఫుడ్ పాయిజన్ జరగవచ్చు. మరొక కాంబినేషన్ శని భగవానుడు కుజుడు. కుజుడు విధికారకుడు, శని భగవానుడు చేసే చర్యలకు కారకుడు. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు జాతకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రారంభంలోనే ఆటంకాలు ఏర్పడతాయి. చివరి వరకు కొనసాగినా ఆ పని యొక్క ఫలితాలను పొందలేకపోతుంటారు. అనుకున్నది సాధించలేక పోతారు. మరొక గ్రహ కలయిక కుజుడు కేతువు ఈ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు వంశపారంపర్యంగా శాపం వెంటాడుతుందని అర్థం. కేతువు ద్వారా కర్మ ఫలితాలు జాతకంలో ప్రవేశించి, రాహు ద్వారా కర్మ ఫలితాలు బయటపడతాయి. అందుకే రాహువు యొక్క స్థానం జాతకంలో అత్యంత ప్రధానం. జాతకంలో శని భగవానుడు రాహువు, శని భగవానుడు కుజుడు, కుజుడు కేతువు ఈ గ్రహ కలయిక కొన్ని రాశులలో ఏర్పడినప్పుడు జాతకుడి అభివృద్ధి అనేది నశిస్తుంది. జాతకంలో అనేక రాజయోగాలు ఉన్నాయి అన్నప్పటికీ పై గ్రహ కలయిక ఆ రాజయోగాలను నిర్వీర్యం చేస్తాయి. శని భగవానుడు కర్మ కారకుడు కుజుడు రక్త కారకుడు. జాతకంలో శని భగవానుడు లగ్నాధిపతి,లాభాధిపతి, భాగ్యాధిపతి అని భావించినప్పటికీ ఈ గ్రహాల కలయిక మాత్రం జాతకుడిని అత్యంత దయనీయమైన స్థితికి తీసుకొస్తుంది. జాతకంలో ఈ గ్రహ కలయిక ఉన్న రాశి ఆధారంగా కొన్ని దేవాలయాలు ఉంటాయి ఆ దేవాలయాలలో అభిషేకము అర్చన లేదా హోమం ఏది చేయాలి అనేది జాతక పరిశీలన ద్వారా తెలుసుకొని ఆ పరిహారం చేసుకున్న ఎడల సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును. 

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.