ఇందిరా ఏకాదశి (28-09-2024) || Indira Ekadashi

 

                                             ఇందిరా ఏకాదశి : పూజా & ఉపవాస విధానం 

ఇందిరా ఏకాదశినాడు ఉపవాసం, జాగరణ చేసినట్లయితే పితృదేవతలు తరిస్తారు. అశ్వమేధయాగంతో సమానమైన ఫలం కలిగిన ఏకాదశి ఇది. సత్యయుగంలో మాహిష్మతీ రాజ్యాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పాలించేవాడు. ధనధాన్య, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిన ఆయన విష్ణుభక్తుడు. ఒకసారి నారద మహర్షి ఆయనకు దర్శనమిచ్చి, యమలోకంలో బాధలు పడుతున్న ఇంద్రసేనుని పితరులను గురించి తెలియచేశాడు. అప్పుడు ఇందిరా ఏకాదశి వ్రతం చేయడం ద్వారా ఇంద్రసేనుడు తన పితరులకు సద్గతులు కలిగించాడు. సాధారణంగా ఏకాదశీ వ్రతవిధానంలో ఉపవాస, జాగరణలుంటాయి. ద్వాదశి ఘడియలు ముగియకముందే అన్నసంతర్పణ చేసి, ఆ తరువాత భోజనం చేయాలి. అయితే ఇందిరా ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశినాడు మాత్రం పితృతర్పణం, పిండప్రదానం కూడా విధిగా చేయాలి.

జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.