Posts

Showing posts from April, 2025

తీర్థం.....

Image
  తీర్థం. తీర్థం అంటే అభిషేక జలం అనే అర్థమే వాడుకలో స్థిరపడింది. దేవతా మూర్తులకు సాధారణంగా నీటితో అభిషేకం చేస్తారు. విగ్రహం, సాలగ్రామం, బీజాక్షరాలు రాసి ఉన్న చక్రాలకు యంత్రాలకు ఆయా దేవతల స్థాయి, ప్రత్యేకతలను బట్టి సాధారణ నీటికి కొబ్బరినీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వట్టివేళ్లు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాల్లో అవసరమైన వాటిని చేర్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు. ఆ మిశ్రమ ద్రవాన్ని శంఖంలో పోసి దాని చివరనుంచి ధారగా అభిషేకం చేస్తారు. సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ, అమ్మవార్లకు శ్రీసూక్త విధానంలో, శివలింగానికి రుద్ర నమకచమకాలతోను, చక్రాలు యంత్రాలు తదితరాలకు వేదమంత్రాలు, బీజాక్షరాల స్మరణ పూర్వకంగా అభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆయా మూర్తుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఆ జలం గ్రహిస్తుంది.  వీటన్నింటి సమాహారమైన ఆ అభిషేక జలం శక్తిమంతమైనది. ఇంటి పరిసరాలను శుద్ధి చేయడానికి వేదమంత్రాలు పఠనంతో శుద్ధి పుణ్యాహవచనం అనే ప్రక్రియ  జరుపుతారు. తీర్థాల్లో నాలుగు రకాలున్నాయి. అవి జల, కషాయ, పంచామృత, పానక తీర్థాలు. పైన చెప్పిన విధంగా అభిషేకం చేసిన జలాన్ని భక్తులకిస్తే దాన్ని జల...

రామో విగ్రహవాన్ ధర్మః

Image
  ‘ రామో విగ్రహవాన్ ధర్మః ’ మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికీ తప్పు కాదు. కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం. తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్ప లేదు, పెపైచ్చు వెళ్లవద్దని బతిమాలుతున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది! తండ్రి మరణించాక ‘అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసు కొంటారో చేసుకోండి!’ అని అప్పులవాళ్లను బుకాయిస్తున్న నేటి సంతానం రాముని నుంచి ఎంతో నేర్చుకోవాలి. తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో చేర్చి వదిలించుకొనే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులనూ, సోదరులనూ తుదముట్టించడానికి వెనుకాడని ...

పంచాంగం - మే 1, 2025

Image
  ఓం శ్రీ గురుభ్యోనమః  పంచాంగం శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,     శ్రీ విశ్వావసు నామ సంవత్సరం       ఉత్తరాయనం - వసంత ఋతువు వైశాఖ మాసం - శుక్ల పక్షం    విక్రం సంవత్సరం  -  కాళయుక్తి 2082, వైశాఖము 4 ఇండియన్ సివిల్ క్యాలెండర్  -  1947, వైశాఖము 11 పుర్నిమంతా  -  2082, వైశాఖము 19 అమాంత  -  2082, వైశాఖము 4 తిథి శుక్లపక్షం చవితి    -  Apr 30 02:12 PM – May 01 11:23 AM శుక్లపక్షం పంచమి    -  May 01 11:23 AM – May 02 09:14 AM నక్షత్రం మృగశిర  -  Apr 30 04:18 PM – May 01 02:20 PM ఆరుద్ర  -  May 01 02:20 PM – May 02 01:04 PM కరణం భద్ర  -  May 01 12:43 AM – May 01 11:24 AM బవ  -  May 01 11:24 AM – May 01 10:14 PM భాలవ  -  May 01 10:14 PM – May 02 09:15 AM యోగం అతిగండము  -  Apr 30 12:01 PM – May 01 08:34 AM సుకర్మము  -  May 01 08:34 AM – May 02 05:38 AM ధృతి  -  May 02 05:38 AM – May 03 03:19 AM వా...

దక్షిణామూర్తి

Image
  దక్షిణామూర్తి   అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అది జ్ఞాన సంపాదనకు, మోక్షసాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు. అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి, జ్ఞానాలను ప్రసాదించేటటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి. ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క చిత్ర పటము ఖచ్చితంగా ఉండాలి. దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణా మూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారి ఇంటిలో కష్టములు ఉండవు . దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటు వంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి . ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని  తొలగించే జ...

అష్టమ వ్యయాధిపతి-విశ్లేషణ

Image
  అష్టమ వ్యయాధిపతి-విశ్లేషణ జాతకంలో చిన్నచిన్న సూచనలు పాటించినప్పుడు గ్రహ రీత్యా ఏర్పడే కష్టాలు, బాధలు, ప్రమాదాలు, వైపరీత్యాలనుండి సులభంగా తప్పించుకొని జీవితం ముందుకు కొనసాగించవచ్చు. ఇదే జ్యోతిష్య శాస్త్రంలోనే సూక్ష్మ రహస్యం. మన పూర్వీకులు,మహర్షులు మనిషి జీవితం సుఖమయంగా ఉండడానికి కొన్ని పద్ధతులు సూచించారు. వీటిని అనుసరించడం వలన జీవితం సురక్షితంగా ఉంటుంది. జాతకంలో ఎనిమిది 12 స్థానాలను దుస్థానాలుగా చెబుతారు ఇవి మనిషి జీవితాన్నే తలక్రిందులుగా చేసేస్తాయి. కానీ జీవితంలో చిన్న చిన్న మార్పులను ఆహ్వానించడం ద్వారా ఈ సమస్య నుండి జాతకుడు బయటపడవచ్చు. ఉదాహరణకు ఒక పెద్ద తుఫాను ఏర్పడినప్పుడు మహా వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకిలింపబడతాయి కానీ చిన్న గడ్డి మొక్క పూర్తిగా నేలకు వంగినప్పటికీ అది పెకిలింప పడదు తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది. అదేవిధంగా జాతకుడు కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జీవితం సుఖమయంగా ఉంటుంది. జాతకంలో లగ్నాధిపతి 8 లేదా 12 స్థానాలకు సంబంధం ఉన్నప్పుడు ఆ జాతకుడు మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఊరు మారడం, దేశము లేదా నగరము మారడం, ఇల్లు మారడం ఉద్యోగం వ్యాపారం, వాహనం,అలవాట...

శుభాలను అందించే - ‘శంఖం'

Image
  శుభాలను అందించే…         ‘శంఖం' భారతీయ సంస్కృతిలో 'శంఖం'కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి. శంఖం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావర్త శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో ‘పాంచజన్యం’ అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని ‘దేవదత్తం’గానూ, భీముని శంఖం ‘పౌండ్రకం’ అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని ‘అనంత విజయమ’నీ, నకులుని శంఖాన్ని ‘సుఘోష’నామంతో, సహదేవుని శంఖాన్ని ‘మణిపుష్ప’ అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది. వైరివర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం. లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణం చెబుతోంది. ...

శివ నామ మహిమ

Image
   శివ నామ మహిమ   రెండవ భాగము దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని వెయ్యి నామాలను ధారాళంగా చెబుతాడు.అంత వేగంగా , తడుముకోకుండా చెప్పగలిగిన వాడు శ్రీకృష్ణుడు మాత్రమేనన్న తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు సంతోషిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు." ధర్మజా ! తెలియని వారు ,సగం తెలిసినవారు శివ, కేశవులకు మధ్య భేదాన్ని సృష్టిస్తు ఉంటారు.సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే ,వారిని వేరు చేసి చూడటం తగదు. శివుని ఉపాసించు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరింపబడును. ఓం "నమశ్శివాయ" మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. "రుద్రం"లో వేదాల మధ్యభాగంలో "నమశ్శివాయ" అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. పంచాక్షరీ మంత్రం... మన ఆత్మ, శరీరం, ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి "నేను నమస్కరిస్తున్నాను" అని అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. ...

వైశాఖ శుధ్ద తదియను "అక్షయ తృతీయ" గా జరుపుకుంటారు.

Image
  వైశాఖ శుద్ధ తదియ విశేషాలు అక్షయతృతీయ  వైశాఖ శుధ్ద తదియను "అక్షయ తృతీయ" గా జరుపుకుంటారు. 30 ఏప్రియల్ 2025 అక్షయ తృతీయ. ఈ రోజునే - "సింహాచల వరాహనరసింహ స్వామి వారి  చందనోత్సవం" కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.   అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు  చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం... 1.. పరశురాముడు జన్మించిన రోజు. 2.. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం. 3.. త్రేతాయుగం మొదలైనరోజు. 4.. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న రోజు. 5.. వ్యాస మహర్షి “మహాభారతము” ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన రోజు. 6.. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు. 7.. శివుని ప్రార్థించి, కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు. 8.. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన రోజు. 9.. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు. 10.. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన రోజు. అక్షయ తృతీయ నాడు మనం  చేపట్టిన  ఏ  కార్య ఫలమైనా, (అది  పుణ్యం కావచ్చు ,...

రాశిఫలాలు - ఏప్రిల్ 30, 2025

Image
  మేషం – ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఉండగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు కోపదాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. వృషభం – నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మీ ఆలోచనలు కొంత కలిసిరావు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపార ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. మిథునం –  వృత్తి – వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కర్కాటకం – సంతృప్తికరమైన ఆర్థిక వనరులు మీలో ఉత్సాహాన్ని మరింతగా పెంచుతాయి. కొనుగోలు అమ్మకాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సింహం – ఇంటా బయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. మరింతగా పొదుపుని పాటించాలని నిర్ణయించుకుంటారు. కన్య –  మిత్ర బృందంలో కొత్త మిత్రులను చేర్చుకుంటారు. వస్త్రధారణకు అలంకరణకు ప్రాధాన్యతని ఇస్తారు.  కుటుంబంలోని ఐక్యమత్యత మీలోని ఆనందాన్ని ఇనుమడింప చేస్త...