తీర్థం.....
తీర్థం.
తీర్థం అంటే అభిషేక జలం అనే అర్థమే వాడుకలో స్థిరపడింది. దేవతా మూర్తులకు సాధారణంగా నీటితో అభిషేకం చేస్తారు. విగ్రహం, సాలగ్రామం, బీజాక్షరాలు రాసి ఉన్న చక్రాలకు యంత్రాలకు ఆయా దేవతల స్థాయి, ప్రత్యేకతలను బట్టి సాధారణ నీటికి కొబ్బరినీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వట్టివేళ్లు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాల్లో అవసరమైన వాటిని చేర్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు. ఆ మిశ్రమ ద్రవాన్ని శంఖంలో పోసి దాని చివరనుంచి ధారగా అభిషేకం చేస్తారు.
సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ, అమ్మవార్లకు శ్రీసూక్త విధానంలో, శివలింగానికి రుద్ర నమకచమకాలతోను, చక్రాలు యంత్రాలు తదితరాలకు వేదమంత్రాలు, బీజాక్షరాల స్మరణ పూర్వకంగా అభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆయా మూర్తుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఆ జలం గ్రహిస్తుంది.
వీటన్నింటి సమాహారమైన ఆ అభిషేక జలం శక్తిమంతమైనది. ఇంటి పరిసరాలను శుద్ధి చేయడానికి వేదమంత్రాలు పఠనంతో శుద్ధి పుణ్యాహవచనం అనే ప్రక్రియ జరుపుతారు. తీర్థాల్లో నాలుగు రకాలున్నాయి. అవి జల, కషాయ, పంచామృత, పానక తీర్థాలు. పైన చెప్పిన విధంగా అభిషేకం చేసిన జలాన్ని భక్తులకిస్తే దాన్ని జలతీర్థం అంటారు. రాత్రి పూజ తరవాత అభిషేక జలంలో కొన్ని మూలికల రసాన్ని/సారాన్ని కలుపుతారు. దీన్నే కషాయ తీర్థం అంటారు. కొల్హాపురి శ్రీమహాలక్ష్మి, కొల్లూరు మూకాంబిక, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని, అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయాల్లో అలా ఇస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల దీర్ఘ రోగాలు త్వరగా నయమవుతాయని నమ్ముతారు.
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం అనే అయిదు" పదార్థాల సమాహారాన్ని పంచామృతం అంటారు. దీనితో ప్రత్యేక సందర్భాల్లో శివుడికి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. ఈ పంచామృత తీర్ధ సేవనం వల్ల ఆరోగ్యపరంగా, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు. నరసింహ స్వామికి, శ్రీరాముడికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ పానకాన్ని భక్తులకు తీర్థంగా పంచుతారు.
ఇవేకాకుండా తులసి, పచ్చకర్పూర, బిల్వ, గంగాజల, హరిద్రా (పసుపు కలిపిన నీరు), తీర్థాల పేరుతో సందర్భోచితంగా అభిషేకం చేస్తుంటారు. వీటిని సేవించడం వల్ల కూడా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరతాయంటారు.
తీర్థాన్ని లోపలికి మూడుసార్లు తీసుకోవాలని పెద్దలు చెబుతారు. ఉద్ధరిణి నిండా తీర్ధం తీసుకుని అరచేతిలో వేసుకుని శిరస్సు మీద ఒక్కసారే చల్లుకోవడాన్ని మార్జన అంటారు. పరిసరాల్లో చల్లేటప్పుడు మామిడి ఆకుల చివరలను తీర్ధమున్న పాత్రలో ముంచుతూ దైవ నామ స్మరణ చేస్తూ చల్లాలి. దీన్ని ప్రోక్షణ అంటారు.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment