రాశిఫలాలు - ఏప్రిల్ 30, 2025


 

మేషం – ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఉండగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు కోపదాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది.

వృషభం – నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మీ ఆలోచనలు కొంత కలిసిరావు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపార ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు.

మిథునం –  వృత్తి – వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం – సంతృప్తికరమైన ఆర్థిక వనరులు మీలో ఉత్సాహాన్ని మరింతగా పెంచుతాయి. కొనుగోలు అమ్మకాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

సింహం – ఇంటా బయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. మరింతగా పొదుపుని పాటించాలని నిర్ణయించుకుంటారు.

కన్య –  మిత్ర బృందంలో కొత్త మిత్రులను చేర్చుకుంటారు. వస్త్రధారణకు అలంకరణకు ప్రాధాన్యతని ఇస్తారు.  కుటుంబంలోని ఐక్యమత్యత మీలోని ఆనందాన్ని ఇనుమడింప చేస్తుంది.

తుల – జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. వృత్తి- వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం పొందుతారు.

వృశ్చికం – ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇందువలన మీకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అవి ప్రస్తుతం మీ పై ప్రభావం చూపించకపోయినా, భవిష్యత్తులో కొంత ఇబ్బంది గురిచేస్తాయి.

ధనుస్సు-  అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. కార్యాలయంలో ఉన్నత పదవులను సాధించడానికి కావలసిన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు.

మకరం – మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అదే విధంగా మంచి ఫలితాలను సాధించగలుగుతారు.  ఆర్థిక సర్దుబాటులను నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చాలా అవసరం.

కుంభం – సంతాన ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. కొత్త బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ పరోక్షంలో మీ కార్యాలయంలో మీకు తెలియకుండా కొన్ని కార్యకలాపాలు జరుగుతాయి.

మీనం – బాధ్యతల నిర్వాహణలో వెనకడుగు వేయరు. వ్యాపారంలో నూతనమైన మార్పులను ప్రవేశ పెట్టడానికి ప్రణాళికలను రూపొందించుకుంటారు. సాహసోపేతమైన కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

    #rasiphalalu #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025