అష్టమ వ్యయాధిపతి-విశ్లేషణ


 అష్టమ వ్యయాధిపతి-విశ్లేషణ

జాతకంలో చిన్నచిన్న సూచనలు పాటించినప్పుడు గ్రహ రీత్యా ఏర్పడే కష్టాలు, బాధలు, ప్రమాదాలు, వైపరీత్యాలనుండి సులభంగా తప్పించుకొని జీవితం ముందుకు కొనసాగించవచ్చు. ఇదే జ్యోతిష్య శాస్త్రంలోనే సూక్ష్మ రహస్యం. మన పూర్వీకులు,మహర్షులు మనిషి జీవితం సుఖమయంగా ఉండడానికి కొన్ని పద్ధతులు సూచించారు. వీటిని అనుసరించడం వలన జీవితం సురక్షితంగా ఉంటుంది. జాతకంలో ఎనిమిది 12 స్థానాలను దుస్థానాలుగా చెబుతారు ఇవి మనిషి జీవితాన్నే తలక్రిందులుగా చేసేస్తాయి. కానీ జీవితంలో చిన్న చిన్న మార్పులను ఆహ్వానించడం ద్వారా ఈ సమస్య నుండి జాతకుడు బయటపడవచ్చు. ఉదాహరణకు ఒక పెద్ద తుఫాను ఏర్పడినప్పుడు మహా వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకిలింపబడతాయి కానీ చిన్న గడ్డి మొక్క పూర్తిగా నేలకు వంగినప్పటికీ అది పెకిలింప పడదు తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది. అదేవిధంగా జాతకుడు కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జీవితం సుఖమయంగా ఉంటుంది. జాతకంలో లగ్నాధిపతి 8 లేదా 12 స్థానాలకు సంబంధం ఉన్నప్పుడు ఆ జాతకుడు మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఊరు మారడం, దేశము లేదా నగరము మారడం, ఇల్లు మారడం ఉద్యోగం వ్యాపారం, వాహనం,అలవాట్లు, వేష భాషలు, ఇటువంటి అన్ని విషయాలలోనూ మారడానికి మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి వీటికి అనుగుణంగా మారినప్పుడు మీ జీవితం ఉన్నత పథంలో ప్రయాణం చేస్తుంది. జాతకంలో అష్టమ స్థానం మీ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలియజేస్తుంది. లగ్నాతిపతి అష్టమంలో ఉన్నా లేదా ద్వాదశంలో ఉన్నా మీరు కచ్చితంగా మార్పు స్వీకరించాలి. లేదంటే జీవితాన్ని వేళ్ళతో సహా పెకిలించివేస్తాయి. అనగా ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వారు అయినా అథః పాతాళ స్థాయిలోకి వచ్చేస్తారు. మీ జాతకంలో లగ్నాధిపతి అష్టమంలో కానీ వ్యయం లో కానీ ఉండి దశ రాబోతుంది అంటే మీరు మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఆయా స్థానాలలో లగ్నాధిపతి ఉచ్చ స్థితిలో ఉంటే జాతకుడు, మహానగరాలలో కానీ విదేశాలలో కానీ శాశ్వత నివాసం పొందడం,అత్యధిక ధనాన్ని సంపాదించడం జరుగుతాయి. ఉదాహరణకు ధనుర్ లగ్నానికి కర్కాటకంలో గురు భగవానుడు స్థితి పొందడం, మీన లగ్నంలో శుక్ర భగవానుడు స్థితి పొందడం ఇవి మంచి ఉదాహరణలు. ఇటువంటి జాతకులు మార్పున ఆహ్వానించినప్పుడు మాత్రమే సత్ఫలితాలు ఉంటాయి. ఇటువంటి గ్రహ స్థితి ఉన్న జాతకులు మా పూర్వీకులు కట్టించిన ఇంట్లో మాత్రమే నేను నివసిస్తాను, తరతరాల నుంచి నేను మా పూర్వీకులు ఈ ఊరిలో మాత్రమే నివసిస్తాము అనుకున్న వారు ఉన్నత స్థితికి వెళ్లలేరు అంతేకాకుండా అనేక సమస్యలతో జీవితాన్ని కొనసాగిస్తూ బాధలు కష్టాలు, సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలిపోతారు. అష్టమ స్థానంలో కానీ వ్యయ స్థానంలో కానీ అత్యధిక గ్రహాలు ఉన్నప్పుడు కూడా జీవితంలో మార్పును ఆహ్వానించాలి. పైన చెప్పిన గ్రహాల యొక్క దశలు ప్రారంభం అయ్యే ముందు మీ జీవితంలో మార్పులను ఆటోమేటిక్గా ఇస్తాయి. మీరు కాదు కూడదు అని మార్పుకు అనుగుణంగా లేకుండా పూర్వ పద్ధతిని అనుసరిస్తే జీవితమంతా సమస్యల మయం అవుతుంది. మీ జాతకంలో లగ్న అష్టమ వ్యయ అధిపతుల సంబంధాన్ని పరిశీలించుకుని అవసరమైతే మార్పును ఆహ్వానించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #astrovidhaataa #akshayathruthiya #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special