శివ నామ మహిమ
శివ నామ మహిమ
రెండవ భాగము
దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని వెయ్యి నామాలను ధారాళంగా చెబుతాడు.అంత వేగంగా , తడుముకోకుండా చెప్పగలిగిన వాడు శ్రీకృష్ణుడు మాత్రమేనన్న తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు సంతోషిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు." ధర్మజా ! తెలియని వారు ,సగం తెలిసినవారు శివ, కేశవులకు మధ్య భేదాన్ని సృష్టిస్తు ఉంటారు.సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే ,వారిని వేరు చేసి చూడటం తగదు.
శివుని ఉపాసించు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరింపబడును. ఓం "నమశ్శివాయ" మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. "రుద్రం"లో వేదాల మధ్యభాగంలో "నమశ్శివాయ" అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది.
ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. పంచాక్షరీ మంత్రం... మన ఆత్మ, శరీరం, ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి "నేను నమస్కరిస్తున్నాను" అని అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. "శివ" అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే "పవిత్రతకు తల వంచి నమస్కరించడం" అనే అర్థం చెప్పవచ్చు.
పుస్తకాలలో " శివుడు " అనే పదానికి చెప్పే "వినాశకారుడు" అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు. శివుడు అంటే నాశనం లేనివాడు అని మంత్రానికి ఉన్న అర్థం కన్నా, ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వనితతరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మిగిలిన మంత్రాలలాగే ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం. అందువల్ల ఈ పదాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలి.
శివుడు అంటే "నిరాకారుడు" అనే అర్థాన్ని చెబుతారు. అలాగే ఆయనను "పరమశివుడు" అని కూడా అంటుంటారు. అంటే "భగవంతుని అంశ "అని అర్థం. ఈ అంశ అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుందని, ఇది విడదీయలేనిదని శైవుల విశ్వాసం. అయితే ఇది మనిషిలో నుంచి విడిపోవడానికి బయటకు కనిపించే పదార్థం వంటిది కాదు. హృదయానికే హృదయంలాంటిది. ఇది అయిదు అక్షరాల సమాహారం. ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి.
రెండు వేల సంవత్సరాలకు ముందు ఆది శంకరాచార్యులు రచించిన నిర్వాణ శటకం సంస్కృతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్లోకాలలో ఒకటి. సద్గురు ఈ శ్లోకాలలోని ప్రాముఖ్యతని పరిశీలిస్తూ ఇందులో వెల్లడించిన భావాన్ని శోధిస్తున్నారు.
సంస్కృత శ్లోకాలు వాటికి తెలుగు అర్థం ఈ కింద అందచేశాము.
సద్గురుః నిర్వాణ అంటే ''నిరాకారం'' అని అర్థం.
నిర్వాణ శటకం దీనినే వివరిస్తోంది - మీకు దీనిలాగానో లేక దానిలాగానో ఉండాలని ఉండదు. ఇది, అది కాకపొతే మరి ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇది మీ మనసుకు అర్థం కాదు ఎందుకంటే దానికి ఎల్లప్పుడూ దేనిలాగానో ఉండాలని ఉంటుంది. నేను మీతో "నాకు ఇలా ఉండడటం ఇష్టంలేదు" "అలా ఉండటం ఇష్టం లేదు" అని అంటే, మీరు "ఓ మరింకేదో గొప్పగా" అని అనుకుంటారు. నేను అలా కాదు అని అంటే "ఓ అంటే శూన్యత్వం" అని అనుకుంటారు. శూన్యత్వం కూడా కాదు. ఏమీ లేకపోవడమా? ఏమీ లేకపోవడం కాదు.
ఈ శటకంలో దానినే వ్యక్తపరుస్తున్నారు.
నిర్వాణ శటకం
మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రె |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తము కూడా కాదు. నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. నేను పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం కూడా కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
నచ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ||
కీలకమైన ప్రాణాన్ని నేను కాదు. పంచవాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానలు) నేను కాదు, సప్త ధాతువులు (రక్త, మాంస,మేదో,ఆస్థి,మజ్జా,రస,శుక్రములు) నేను కాదు. పంచకోశాలు (అన్నమయ,ప్రాణమయ,మనోమయ, విజ్ఞ్యానమయ, ఆనందమయ) నేను కాదు. కర్మేంద్రియాలు (వాక్కు,పాణి,పాద,పాయు,ఉపస్థ) నేను కాదు.నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాలో రాగద్వేషములు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న మే మృత్యు ర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న చ సంగతం నైవ ముక్తిర్ న మేయః
చిదానంద రూపః శివోహం శివోహం *నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను, నాకు మోక్షము లేదు, బంధము లేదు, నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని, నేను శివుడిని.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #akshayathruthiya #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment