వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః " అంటే అర్ధం తెలుసా? SUN'DAY MO(O)N'DAY TUESDAY WEDNESDAY THURSDAY FRIDAY SATUR(N)DAY అంటే ఏమిటో తెలుసా....? సూర్యహోర చంద్రహోర కుజహోర బుధహోర గురుహోర శుక్రహోర శనిహోర - అంటే ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి. ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము. 1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు! కాస్త విపులంగా.... భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది. మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః అనగా... పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్...