మనకు కావల్సింది - భగవంతుడిని ఎలా అడగాలి?
ఈరోజుల్లో ఇది చాలా మందికి ఒక పెద్ద విచారం!!...
మనము భగవంతుడు అనే నమ్మకం , విశ్వాసంతో ఆయన పాదాల చెంతకు చేరినపుడు, ఇంకా ఆయనకు నివేదించడం అవసరమా???
మన కన్న తల్లి టైం కి మనకు ఏమి కావాలో తెలుసుకొని అన్నీ అందిస్తుంది,
మనము ఉద్యోగం చేసే కంపనీ వారు మనకు ఎప్పుడు ఏమీ కావాలో అన్నీ అందిస్తుంది ...
మరి వీటన్నిటినీ సృష్టించిన ఆ దేవదేవుడు నీకు ఏమి కావాలో ఆయనకు తెలియదా !!!...
" మీరు భగవంతుడుని అది కావాలి, ఇది కావాలి అని అడగవద్దు"...
మనసులో భక్తి, ప్రేమ, విశ్వాసాలు వృద్ధి చేసుకోండి, అయన ఇచ్చినది స్వీకరించడానికి సిద్ధపడి ఉండండి...
రాముడు వచ్చి తన అంత్యక్రియలు నిర్వహించాలని జటాయువు కోరుకుందా?
శబరి అడిగిందా రాముడు తన దగ్గరకు రావాలని!?
కృష్ణుని కుచేలుడు అడిగాడా తనకు సంపదలు ఇవ్వమని ?
వారిలో ఉండిన ప్రేమ, భక్తి, విశ్వాసాలే భగవంతుణ్ణి వారి చెంతకు రప్పించాయి.
మీ మనసులో భగవంతుని పట్ల దృఢమైన భక్తి, ప్రేమ విశ్వాసాలు ఉంటే మీరు ఎదీ అడగనవసరం లేకుండానే ఆయనే స్వయంగా అన్నీ సమకూరుస్తాడు.
యాచించడం నిజ భక్తుని లక్షణం కాదు!!...
"మీ మనసులో భగవంతుని నిలుపుకొండి...సమస్తమూ మీ చెంతకే వచ్చి చేరుతుంది..."
ఇది సత్యం ...
- సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment