రాశిఫలాలు - ఫిబ్రవరి 01 - 2025



 

మేషం:

ఆత్మసాక్షికి విలువనిచ్చి మున్ముందుకు సాగిపోతారు. మీ కష్టం వలన కార్యాలయంలో మీ సహ ఉద్యోగులకు కూడా ఉద్యోగ పరంగా చాలా మేలు జరుగుతుంది. మీరు నమ్మిన సన్నిహితుల పనితీరు మీకు నచ్చదు.

వృషభం:

ప్రతి విషయానికి  తగాదాలు పడే వారి విలువ చెప్పుకోదగిన స్థాయిలో మీకు చికాకు కలిగిస్తుంది. మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుండి తప్పుకుంటారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తారు.

మిథునం:

స్థిరాస్తులు, లిటిగేషన్ వ్యవహారాలు పరిష్కరించి కొంత ప్రయోజనం పొందగలుగుతారు. అవగాహన లోపం వల్ల బంధువర్గం మిత్రవర్గం నష్టపోయి మిమ్మల్ని కూడా కొంతవరకు నష్టపరుస్తారు.

కర్కాటకం:

స్నేహితులతో బంధుత్వం కలుస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించడం మంచిది కాదని గ్రహించండి.

సింహం:

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వలన సంతోషం కలుగుతుంది. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

కన్య:

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

తుల:

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం నకు నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

వృశ్చికం:

ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.  పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు.

ధనుస్సు:

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయం లో జాగ్రత్తలు అవసరం.

మకరం:

అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది.

కుంభం:

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పంలు కుదురుతాయి.  అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం వాహన విషయాలలో నిర్లక్ష్యం తగదు.

మీనం:

వృత్తి – వ్యాపారాలలో సల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.  వివాదాలకు చాలా దూరంగా ఉండండి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పొందుతారు.

  1. సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

      HAVANIJAAA
      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
      శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

      #rasiphalalu #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025