Posts

Showing posts from August, 2024

ఈ రోజు రాశి ఫలాలు

Image
మేష  మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. అనుభవముఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి,లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. విలువైన వస్తువులలాగనే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయమును వృధాచేస్తారు.రోజుచివర్లో ఇదిమీయొక్క విచారానికి కారణము అవుతుంది.  వృషభ  ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. గ్రహచలనం రీత్యా, ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకూ అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈ రోజు నిండుగా అనుభూతి చెందుతాయి. చంద్రుడియొక్క స్థితిగతులనుబట్టి మీకుఈరోజు మీచేతుల్లో చాలా ఖాళిసమయము ఉంటుంది.కానీ,మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. స్వర్గం భూమ్మీదే ఉందని  మిథున  వృత్తిలో మీ నైపుణ్యం ప

శ్రావణ శుక్రవారాలు... ఎందుకంత ప్రత్యేకం!

Image
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. హైందవుల ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలూ, నోములతో... ప్రతి ముత్తయిదువా హడావుడి పడిపోతుంది. అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు. ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎందుకంత ప్రాధాన్యతా అంటే...  అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం... వంటివాటిని చిహ్నము. ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, గ్రహాల అనుకూలతా సిద్ధిస్తాయి. శ్రీమ‌హావిష్ణువు జ‌న్మ‌న‌క్ష‌త్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణమాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో... ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునేవారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం.  సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటలో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉందికదా అని చులకనగా, అజాగ్రత్తగా ఉంటే... అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల ఎరుకనీ

మానవుడు - మానవ జన్మ (పంచభూతములు )

Image
  భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఈ ఐదు కలియుట వలన మానవ దేహము సంభవించును.  1.భూమి వలన : చర్మము, ఎముకలు, నరములు, వెంట్రుకలు, మాంసము తయారగును. 2.జలము వలన : మూత్రము, వీర్యము, ఎముకలలో వుండే మజ్జ, చీము, రక్తము తయారగును.  3.అగ్ని వలన : ఆకలి, దాహము, బుద్ధి, నిద్ర, కాంతి వచ్చును.  4.గాలి వలన : ముడుచుట, సాగుట, పరుగత్తుట, గెంతుట కలుగును.  5.ఆకాశము వలన :  ధ్వని, ఆలోచన, భ్రమ, సందేహాలు కలుగును. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము,సంస్కార ము మున్నగునవి పూర్వజన్మవాసనలతో కూడియుండును. జ్ఞానేంద్రియములైన వాక్కు, పాణి,  పాదములు, ఆసనము, శిశ్నేంద్రియము మున్నగునవి,  ప్రాణ, అపాన, సమాన, వ్యాన, కూర్మ, ధనుంజయ మున్నగు తొమ్మిది వాయువులు   ఈ దేహము బ్రతికి వున్నంత వరకు వుండి, మనం తినే ఆహారపదార్థాలను మన దేహమునకు బలాన్ని కలిగించుటకు కర్మలను ఆచరించుటకు తోడ్పడుచున్నవి. మానవుడు భుజించిన  ఆహారములో అన్నమును జలమును వేరు వేరుగా వుంచి, అగ్ని పైన జలము, జలము పైని అన్నమును వుంచి, ప్రాణ వాయువు తాను అగ్నికి క్రిందగా వుండే ఆసన ప్రదేశమందు  ప్రవేశించి, తనపైవుండే అగ్నిని ప్రజ్వలింప చేయగా ఆ అగ్ని జలమును, అన్నమును పచనము చేసిరసమును, పిప్ప

ప్రవర యొక్క అర్ధం.

Image
 చతుస్సాగర పర్యంతం (మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...  గో బ్రాహ్మణేభ్య శుభం భవతు (సర్వాబీష్ట ప్రదాయిని అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ).... (మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.....  శ్రీ * శర్మ నామధేయస్య ( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు... 1.కామాగ్ని 2.క్రోధాగ్ని 3.క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన.. శ్రీ * *శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శ
ఈరోజు రాశిఫలాలు   మేషం ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.  వృషభం విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మిథునం కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. కర్కాటకం కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. సింహం మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతనకార్యాలకు ఆటంకాలు ఏర్ప
 ఈరోజు పంచాంగం  Month శ్రావణము Paksham కృష్ణపక్షం Tithi దశమి : Aug 28 01:33 AM to Aug 29 01:19 AM ఏకాదశి : Aug 29 01:19 AM to Aug 30 01:37 AM Nakshatram మృగశిర: Aug 27 03:38 PM to Aug 28 03:53 PM ఆరుద్ర: Aug 28 03:53 PM to Aug 29 04:39 PM Rahukalam 12:17 PM to 1:50 PM

రాఖీపౌర్ణిమ పూజలు

Image
  భగవత్ భందువులందరికిీ  నమస్కారం, రాఖీపౌర్ణిమ సందర్భంగా   అక్కాచెల్లెలు  లేధా  అన్నతమ్ముడులు  వారివారి సోదరసోదరిమనుల పేరు మీద పూజలు,మహా మృత్యుంజయహోమం , ఆయుష్య హోమం శ్రీ   విధాత పీఠంలో 19-08-2024 రోజునా  జరిపించవచ్చు .హవనిజా  గారి ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమాం జరగనునది .  కావున మీ మీగోత్ర నామాలు మరియు  516/- ఈ క్రింది నెంబరుకు పంపగలరు, phone no:9666602371    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

శనిత్రయోదశి మరియు ప్రదోష వ్రతం

Image
   భగవత్ భందువులందరికిీ  నమస్కారం, శ్రీ విధాత పీఠంలో  17-08-2024   రోజునా  శనిత్రయోదశి మరియు ప్రదోష వ్రతం కలిసి రావడం చాలా మంచిది కావున హవనిజా  గారి ఆధ్వర్యంలో శివుడుకి అభిషేకం ,అర్చనలు  ,పూజలు  జరగనునది . మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 516/- ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay కానీ పంపగలరు, phone no: 9666602371 జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

వరలక్ష్మి వ్రతం పూజలు

Image
 భగవత్ భందువులందరికిీ  నమస్కారం, శ్రీ విధాత పీఠంలో  16-08-2024 వరలక్ష్మి వ్రతం  సందర్భంగా  మహా లక్ష్మీ సహాసరనామ  పరాయణం , వరలక్ష్మి పూజ ,అభిషేకం ,అర్చన ,మహాలక్ష్మి హోమం హవనిజా  గారి ఆధ్వర్యంలో జరగనునది . మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 516/- ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay కానీ పంపగలరు, phone no: 9666602371 జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

జీవితంలో సమస్యలన్నీ పోయి, అదృష్టం పట్టాలంటే ఏమి చెయ్యలో తెలుసా ....???

Image
శ్రీ విధాతపీఠం ఆధ్వర్యంలో ఒక  అద్భుత అవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోండి.!!!  ఒక్క లక్ష్మీదేవి హోమం చేస్తేనే ఎంతో పుణ్యం.,అలాంటిది 108 హోమాలతో అష్టోత్తర శతహోమ కుండాత్మక అదృష్టలక్ష్మీ మహాయాగం నిర్వహించడం జరుగుతుంది .  పూజలో పాల్గొనాలి అనుకొనేవారు లేదా పూజ  పూర్తిగా వివరాలు తెలుసుకోవడం కోసం కింది నెంబర్ కు సంప్రదించండి ఫన్ నో:9666602371 ,9666609724

("వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి")

Image
చక్రత్తాళ్వార్ (సుదర్శనచక్రం)  చక్రత్తాళ్వార్ గా పిలువబడే "సుదర్శనచక్రం", రెండడుగుల ఎత్తు కలిగి, చక్రాకారంలో 16 కోణాలు కలిగి, పంచలోహ నిర్మితమై, ఆరంగుళాల ఎత్తైన, వెండి చతురస్రపీఠంపై విరాజిల్లు తుంటుంది. ప్రతి సంవత్సరం నాలుగు సందర్భాలలోచక్రత్తాళ్వార్ కు స్వామిపుష్కరిణిలో చక్రస్నానం గావిస్తారు.  స్వామివారి పరమాయుధమైన సుదర్శనచక్రం పూర్వయుగాలలో ఎందరో దైత్యులను సంహరించింది. చక్రాయుధానికి స్వామివారు ప్రత్యేకంగా అనుజ్ఞ ఇవ్వనవసరం లేదు. స్వామివారి చిత్రాన్ని, సంకల్పాన్ని, భక్తుల వాంఛితాలను గుర్తెరిగి, శిష్టరక్షణ దుష్టశిక్షణ గావించి, తిరిగి పదిలంగా స్వామి వారి చెంతకు చేరుకుంటుంది. మనకు సుపరిచితమైన "గజేంద్రమోక్షం" ఘట్టమునందు మొసలి కోరలనుండి గజరాజును రక్షించినది సుదర్శనచక్రమే! భక్తులు తిరుమల యాత్రకు సంకల్పించినది మొదలు, వారిని ప్రయాణ మార్గంలోనూ, తిరుమల క్షేత్రం లోనూ అనుకోని విపత్తుల నుండి కాపాడి, తిరిగి వారి వారి గమ్యాలకు సురక్షితంగా చేర్చే బాధ్యతను సుదర్శనచక్రం చేపడుతుందని భక్తులు నమ్ముతారు. సాలగ్రామాలు   గర్భాలయం నందు వివిధ ఆకృతుల్లో, పరిమాణాల్లో ఉన్న అనేక సాలగ్రామాలు స్వామివా

ప్రవర యొక్క అర్ధం.

Image
చతుస్సాగర పర్యంతం (మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...  గో బ్రాహ్మణేభ్య శుభం భవతు (సర్వాబీష్ట ప్రదాయిని అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ).... (మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.....  శ్రీ * శర్మ నామధేయస్య ( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు... 1.కామాగ్ని 2.క్రోధాగ్ని 3.క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన.. శ్రీ * *శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శక

108 పాద శివలింగాలు

Image
శ్రీ విశ్వేశ్వర లింగము బ్రహ్మపురి గ్రామం, కే. గంగవరం మండలం పాద శివలింగ స్ధానం:       చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 17 kms. దూరాన, పావన గౌతమీ నదీ (గోదావరి) తీరాన బ్రహ్మపురి (Brahmapuri) అను గ్రామం ఉంది. క్షేత్రం నందు శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం కలదు. బ్రహ్మపురి గ్రామం నకు ద్రాక్షారామం నుంచి బస్ సర్వీసులు కలవు.  యానాం నుంచి ఆటోలు ఉంటాయి. ఆలయం:       మన పురాణం ప్రకారం బ్రహ్మకు అయిదు తలలు ఉండేవి. పూర్ణవల్లీ కథలో బ్రహ్మదేవుని ఐదవ తలను శివుడు ఖండించినట్లగా ఉంది. ఒక రోజు బ్రహ్మదేవుడు, శివ రూపంలో కైలాసాన్ని సందర్శించడం జరిగింది. ఆ శివ రూపానికి పార్వతీ దేవి పాద పూజ చేయనారంభించింది. బ్రహ్మ కపటం రూపం గ్రహించిన శివుడు, బ్రహ్మ తలను ఖండించుతాడు. ఆ చర్య వలన శివునికి బ్రహ్మ హత్యాపాతకం ప్రాప్తి అయింది. బ్రహ్మ పుర్రె పట్టుకొని శివుడు పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేసాడు. బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి పొందుటకు శివుడు సకల పుణ్య తీర్ధాలలో స్నానం ఆచారించాడు. గౌతమీ నదీ పుణ్య ఫలంతో బ్రహ్మ హత్యాపాతకం నుంచి శివునికి విముక్తి కలిగింది. శివుని

వరలక్ష్మి వ్రతం మరియు పూజ విదానం :

Image
  భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ప్రార్థన నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే తాత్పర్యం : మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్

రావి ఆకులపై ప్రమిదను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే?

Image
రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది.  శాపాలు, దోషాలు,  పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే.  అంతేగాకుండా ఇంట్లో రావిచెట్టు ఆకులను వుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష,కర్మ ఫలితాలు వుండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి.  రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి..  దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.  శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు,  రాహు-కేతుదోషాలు,  నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి, మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు,  బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు,  గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు,  శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు,  శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలు,  ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించడం..  ఆమె అనుగ్రహం పొందాలంటే..  తమలపాకుపై ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం

పంచాంగం

Image
  ఆగష్టు 10, 2024  శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్ల పక్షం తిథి: షష్ఠి రా1.46 వారం: స్థిరవాసరే (శనివారం) నక్షత్రం: చిత్ర తె3.17 యోగం: సాధ్యం మ1.52 కరణం: కౌలువ మ12.49 & తైతుల రా1.46 వర్జ్యం: ఉ9.37-11.23. దుర్ముహూర్తము: ఉ5.45-7.26 అమృతకాలం: రా8.13-9.59 రాహుకాలం: ఉ9.00-10.30. యమగండం: మ1.30-3.00 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: కన్య సూర్యోదయం: 5.44 సూర్యాస్తమయం: 6.27 సర్వేజనా సుఖినో భవంతు , శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక ACCANKSHA YEDUR (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph: 9666602371

🙏🙏ఉప్పు కి ఐశ్వర్యము కి ఉన్న సంబంధం ఏమిటి.🙏🙏

Image
  మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రం లో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళఉప్పు , కల్లు ఉప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు. ఉప్పుని చేతితో తీసుకొని ఎదుట వారి చేతికి ఇవ్వకూడదు. చాల మంది డబ్బు సంపాదిస్తాము కాని నిలవడం లేదు అని అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితం లో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి, మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి.. రాత్రి పూట ఉప్పు అనకూడదు అంటారు. రాత్రి పూట లవణం అని అనాలి. ఉప్పును శనీశ్వరుడుకి నూనెతో పాటుగ వేస్తారు. అదివేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగ వేసి ఏదో అనుకూలంగ ఉన్న మూలన పెడితే ఆర్ధిక కష్టాలు తీరుతాయి అంటారు. కాలము రోజులలో మంగళవారం .శుక్రవారం నాడు యింటికి వచ్చిన ముత్తైదువులకు, ముందుగ చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇచ్చేవారు .అలా చేయడము వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగ ఉంటాయి అంటారు. కొందరు ఎర్రటి గుడ్డ లో రాళ్ళ ఉప్పు పోసి యింటి గుమ్మం ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డ లో కట్టిన ఉప్పు ఎవరు తొక్