🙏🙏ఉప్పు కి ఐశ్వర్యము కి ఉన్న సంబంధం ఏమిటి.🙏🙏

 



మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రం లో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళఉప్పు , కల్లు ఉప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు.


ఉప్పుని చేతితో తీసుకొని ఎదుట వారి చేతికి ఇవ్వకూడదు. చాల మంది డబ్బు సంపాదిస్తాము కాని నిలవడం లేదు అని అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితం లో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి, మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి..


రాత్రి పూట ఉప్పు అనకూడదు అంటారు. రాత్రి పూట లవణం అని అనాలి. ఉప్పును శనీశ్వరుడుకి నూనెతో పాటుగ వేస్తారు. అదివేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగ వేసి ఏదో అనుకూలంగ ఉన్న మూలన పెడితే ఆర్ధిక కష్టాలు తీరుతాయి అంటారు.


కాలము రోజులలో మంగళవారం .శుక్రవారం నాడు యింటికి వచ్చిన ముత్తైదువులకు, ముందుగ చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇచ్చేవారు .అలా చేయడము వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగ ఉంటాయి అంటారు.


కొందరు ఎర్రటి గుడ్డ లో రాళ్ళ ఉప్పు పోసి యింటి గుమ్మం ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డ లో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధముగ చెట్టు మొదలు లో వేయాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో యిల్లు కళకళ లాడుతుంది అంటారు.


ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం అరువు తెచ్చుకోవడం సరి కాదు. ఉప్పు అనగానే పాకెట్ తీస్తారు చాలామంది, అది కాదు రాళ్ళ ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది. 


🌹ఓం లక్ష్మీదేవియే నమః🌹 

సర్వేజనా సుఖినో భవంతు ,
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.