మానవుడు - మానవ జన్మ (పంచభూతములు )

 


భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఈ ఐదు

కలియుట వలన మానవ దేహము సంభవించును. 

1.భూమి వలన :

చర్మము, ఎముకలు, నరములు, వెంట్రుకలు, మాంసము తయారగును.

2.జలము వలన :

మూత్రము, వీర్యము, ఎముకలలో వుండే మజ్జ, చీము, రక్తము తయారగును. 

3.అగ్ని వలన :

ఆకలి, దాహము, బుద్ధి, నిద్ర, కాంతి వచ్చును. 

4.గాలి వలన :

ముడుచుట, సాగుట, పరుగత్తుట, గెంతుట కలుగును. 

5.ఆకాశము వలన : 

ధ్వని, ఆలోచన, భ్రమ, సందేహాలు కలుగును. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము,సంస్కార

ము మున్నగునవి పూర్వజన్మవాసనలతో కూడియుండును. జ్ఞానేంద్రియములైన వాక్కు, పాణి,  పాదములు, ఆసనము, శిశ్నేంద్రియము మున్నగునవి,  ప్రాణ, అపాన, సమాన, వ్యాన, కూర్మ, ధనుంజయ మున్నగు తొమ్మిది వాయువులు   ఈ దేహము బ్రతికి వున్నంత వరకు వుండి, మనం తినే ఆహారపదార్థాలను మన దేహమునకు బలాన్ని కలిగించుటకు కర్మలను ఆచరించుటకు తోడ్పడుచున్నవి. మానవుడు భుజించిన  ఆహారములో అన్నమును జలమును వేరు వేరుగా వుంచి, అగ్ని పైన జలము, జలము పైని అన్నమును వుంచి, ప్రాణ వాయువు తాను అగ్నికి క్రిందగా వుండే ఆసన ప్రదేశమందు  ప్రవేశించి, తనపైవుండే అగ్నిని ప్రజ్వలింప చేయగా ఆ అగ్ని జలమును, అన్నమును పచనము చేసిరసమును, పిప్పిని వేర్వేరుగా చేయును. అప్పుడువ్యానవాయువు రసమును శరీరమంతటా వ్యాపింప చేసి, మిగిలిన పిప్పిని చెవులు, నేత్రములు,ముక్కు, నాలుక, దంతములు,మర్మ స్థానము,చర్మము మున్నగు 12 స్థానముల ద్వారా ( ఇంద్రియముల నుండి ) విసర్జింప చేయును. 

సర్వేజనా సుఖినో భవంతు ,
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.