108 పాద శివలింగాలు



శ్రీ విశ్వేశ్వర లింగము

బ్రహ్మపురి గ్రామం, కే. గంగవరం మండలం

పాద శివలింగ స్ధానం: 

     చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 17 kms. దూరాన, పావన గౌతమీ నదీ (గోదావరి) తీరాన బ్రహ్మపురి (Brahmapuri) అను గ్రామం ఉంది. క్షేత్రం నందు శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం కలదు. బ్రహ్మపురి గ్రామం నకు ద్రాక్షారామం నుంచి బస్ సర్వీసులు కలవు.  యానాం నుంచి ఆటోలు ఉంటాయి.

ఆలయం: 

     మన పురాణం ప్రకారం బ్రహ్మకు అయిదు తలలు ఉండేవి. పూర్ణవల్లీ కథలో బ్రహ్మదేవుని ఐదవ తలను శివుడు ఖండించినట్లగా ఉంది. ఒక రోజు బ్రహ్మదేవుడు, శివ రూపంలో కైలాసాన్ని సందర్శించడం జరిగింది. ఆ శివ రూపానికి పార్వతీ దేవి పాద పూజ చేయనారంభించింది. బ్రహ్మ కపటం రూపం గ్రహించిన శివుడు, బ్రహ్మ తలను ఖండించుతాడు. ఆ చర్య వలన శివునికి బ్రహ్మ హత్యాపాతకం ప్రాప్తి అయింది. బ్రహ్మ పుర్రె పట్టుకొని శివుడు పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేసాడు. బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి పొందుటకు శివుడు సకల పుణ్య తీర్ధాలలో స్నానం ఆచారించాడు. గౌతమీ నదీ పుణ్య ఫలంతో బ్రహ్మ హత్యాపాతకం నుంచి శివునికి విముక్తి కలిగింది. శివుని చేతిలోని బ్రహ్మ పుర్రె నదిలోకి జారింది. ఆ కారణముగా ఈ గౌతమీ నది తీర ప్రాంతమునకు "బ్రహ్మపుర్రె" అనే పేరు వచ్చింది. కాలక్రమేన పేరు మార్పుచెంది, బ్రహ్మపురిగా స్ధిర పడింది.

శ్రీ విశ్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాల్లో ఒకటిగా ప్రతీతి. శ్రీ విశ్వేశ్వరాలయం నందలి శివలింగము స్వత సిద్ధంగా మూడు విభూతి రేఖలను మరియు మూడవ కన్నును కలిగియుండుట విశేషం. శ్రీ విశ్వేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం.

ఆలయ ప్రాంగణములో శ్రీ విశ్వేశ్వరాలయం మరియు శ్రీ కేశవ స్వామి ఆలయం ఉంటాయి. శ్రీ విశ్వేశ్వరాలయముకు గాలి గోపురం, ధ్వజస్తంభం, ముఖ మండపం, అంతరాలయం,గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ విశ్వేశ్వర లింగము దర్శనమిస్తుంది. అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్యడు, వీరభద్రుడు, అన్నపూర్ణా దేవి కొలువై ఉంటారు. ప్రతి నిత్యం శ్రీ విశ్వేశ్వర స్వామికి అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. 

⭐ శిశువు జన్మించిన సమయంను బట్టి నక్షత్రం, పాదం, రాశి తెలుస్తుంది. వీటి వలన శిశువు జన్మించిన నక్షత్ర పాదం యొక్క దోషములు తెలుస్తాయి. ఆ దోషములు నివారించుటకు శాంతులు జరుపుతారు. జన్మించిన శిశువు యొక్క నక్షత్ర దోషములు నివారించుటకు భీమమండలములోని 108 జన్మ నక్షత్ర పాద శివలింగాలున్నాయి. ఆ శిశువు జన్మ నక్షత్ర పాదముకు సంబంధించిన లింగ ప్రతిష్టను దర్శించుట అవసరం. స్వామి దర్శనం తో వీరికి కొంత ఉపశమనం (ఊరట) దొరుకుతుంది. ఏ శాంతులు లేని వారు కూడ దర్శించుట మంచిది. ఆయా నక్షత్ర పాద లింగ ప్రతిష్ట నుంచి వారు ఆశ్వీరచనాలు పొందగలము.

💫 బ్రహ్మపురి - శ్రీ విశ్వేశ్వర లింగము ను మేషరాశి లోని అశ్విని నక్షత్రం (1వ పాదం) చెందిన ప్రతిష్టగా చెప్పుచుంటారు. అశ్విని నక్షత్రం 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. జన్మించిన శిశువు యొక్క నక్షత్ర దోషములు నివారించుటకు శాంతులు జరుపుతారు. బ్రహ్మపురి గ్రామం లోని శ్రీ విశ్వేశ్వర లింగమునకు గ్రహ శాంతులు జరిపించుట శ్రేష్టం.

🔱 దోషము లేక పొయినా ఆయా జన్మ నక్షత్ర పాద శివ లింగ దర్శనం శుభాదాయకం. జన్మ కాల నక్షత్ర దోషాలు మరియు మధ్య కాలములో వచ్చు నక్షత్ర దోషాలు కు శాంతి జరిపించాలి. విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి. నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామిని సంప్రదించగలరు. 

రవాణా సమాచారం

* రామచంద్రపురం నుంచి బ్రహ్మపురి గ్రామం నకు బస్సులు (వయా) ద్రాక్షారామం మీదగా పరిమితంగా ఉంటాయి. కాకినాడ నుంచి బ్రహ్మపురి గ్రామం నకు బస్సులు (వయా) ద్రాక్షారామం మీదగా పరిమితంగా ఉంటాయి. కే. గంగవరం నుంచి ఆటోలు దొరుకుతాయి. ద్రాక్షారామం - కోటిపల్లి రోడ్డులో కే. గంగవరం ఉంటుంది.

(1) ద్రాక్షారామం నకు సుమారు 21 kms. దూరాన యానాం అను పట్టణం ఉంది. రాజమండ్రి నుంచి యానాం పోవు బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. కోలంక మరియు ఇంజరం నుంచి బ్రహ్మపురి గ్రామం నకు రోడ్డు మార్గములున్నాయి. ఇచ్చట బ్రహ్మపురి కి ఆటోలు చాల తక్కువుగా దొరుకుతాయి. ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి.

(2) కాకినాడ నుంచి యానాం కు బస్సులు (Via) చొల్లంగి, తాళ్ళరేవు, నీలపల్లి మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

యానాం నుంచి బ్రహ్మపురి గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 8 kms. యానాం బైపాస్ రోడ్ నుంచి బ్రహ్మపురి గ్రామం నకు గోదావరి గట్టు మీదగా ఆటోలు ఉంటాయి. షేరింగ్ ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి. ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి.

🚂 బ్రహ్మపురి గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ రాజమండ్రి మరియు కాకినాడ. 

🛌 యాత్రికులకు మంచి వసతులు & టాక్సీలు యానాం పట్టణంలో దొరుకుతాయి. యానాం, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతము లోనికి వస్తుంది.

హైందవ ధర్మమును గౌరవించిన హిందువులు, వారు జన్మించిన నక్షత్ర పాద శివ లింగ ప్రతిష్టను దర్శించ వలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. నక్షత్ర దోషములు లేని వారు కూడ దర్శించుట మంగళము. దైవం క్రింద ప్రతిష్టించబడిన యంత్రం నందలి శక్తి నొందేందుకు పాద శివ లింగ ప్రతిష్ట దర్శనం అవసరం.

సర్వేజనా సుఖినో భవంతు ,

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371.


Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.