చతుర్యోగములు చతుర్యోగములు అనగా కర్మ, భక్తి, జ్ఞాన,ధ్యానయోగములు. కొందరు కర్మయోగం గొప్పదని, కొందరు భక్తియోగం గొప్పదని, కొందరు జ్ఞానయోగం గొప్పదని కొందరు ధ్యానయోగం గొప్పదని పిడివాదాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఈ యోగాలు దేనికది ప్రత్యేకమైనది కాదు. ఒకదాని కొకటి సమన్వయం చేసుకుంటూ అన్నింటిని ఆచరించవలసిందే. భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానమిచ్చి ఆదరించింది. సాధారణంగా మనం చేసే పనులలో, అన్ని లౌకిక కార్యాలలో కూడా ఈ 4 యోగాలు కలసి ఉండాల్సిందే*. అలాంటిది పరమపురుషార్థమైన మోక్షప్రాప్తికి వీటన్నింటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది? ఉదాహరణకు వంట విషయాన్నే తీసుకోండి, వంట అనేది మీరు ప్రతిరోజూ చేసే ముఖ్యమైన పని. ఈ పనిలో కూడా 4 యోగాలు కలిసే ఉండాలి. ఏ యోగం లోపించినా వంట చెడిపోతుంది. (i) వంట చేయాలంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు అన్నీ సమకూర్చుకోవాలి. కూరగాయలు తరిగి ఉంచుకోవాలి. పొయ్యి వెలిగించాలి. పాత్రలు శుభ్రం చేసుకోవాలి. ఇదంతా కర్మయోగం. (ii) బియ్యానికి తగినన్ని నీళ్ళు, పప్పుకు తగినంత ఉప్పు, వంటకు తగినంత మంట, వంట చేసే విధానము - ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇదంతా జ్ఞానయోగం. (iii) పాత్రను పొయ్యి మీద పడేసి వీధిలో కబుర్లు ...
Comments
Post a Comment