పూర్వీకుల ఆస్తి

పూర్వీకుల ఆస్తి పూర్వీకుల ఆస్తి ఎవరు అనుభవించగలుగుతారు లేదా ఎవరు నష్టపోతారు అనేది జ్యోతిష్యం ప్రకారం కచ్చితంగా నిర్ధారించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు బలంగా ఉండడం లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. పూర్వీకుల ఆస్తిని ఏ లగ్న జాతకులకు అయినా పంచమ స్థానము తెలియజేస్తుంది. ఈ స్థానంలో శుభగ్రహాలు స్థితి పొందినప్పుడు పూర్వీకుల ఆస్తుల ద్వారా ఆదాయం పొందగలుగుతారు. పంచమ స్థానంలో రాహు కేతువులు రవి, కుజుడు, శని భగవానుడు, క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్తుల పట్ల ఆశలు వదులుకోవలసినదే. దీనిలో కొద్దిగా మినహాయింపు కలదు పంచమ క్షేత్రంలో ఉన్న పాప గ్రహము ఆ స్థానానికి అధిపతి అయితే ఈ నియమం వర్తించదు. పంచమక్షేత్రంలో రాహువు ఉన్నప్పుడు కొంతమందిలో పూర్వీకుల ఆస్తి లభిస్తుంది కానీ వీరి కళ్ళముందే వీరి ఆస్తిని కొడుకులు ధ్వంసం చేసేస్తారు. తల్లిదండ్రుల మాట వినని సంతానము లేదా దత్తత తీసుకున్న సంతానము ద్వారా ఈ ఆస్తిని అతి తొందర్లోనే కోల్పోతారు. ఈ నియమానికి కూడా మరొక మినహాయింపు ఉంది పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు దానితో పాటే ఐదు డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో గురువు ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్త...