రాశిఫలాలు - మే 31, 2025

 

మేషం

సమాజంలో పెద్దల  అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల  నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి  శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి  కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృషభం

వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ  ప్రయత్నాలు నిదానంగా  సాగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణ విషయంలో  అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ  ప్రయత్నాలు కలసిరావు. కీలక విషయాలలో   ఆలోచించి ముందుకు సాగాలి.

మిధునం

మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో  వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో  మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

కర్కాటకం

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం  పొందుతారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు  అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో  బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు  వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో  స్ధిరాస్తి  వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి   నిరుత్సాహపరుస్తుంది.  నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి.

కన్య

నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య  వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో  దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి  పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ఋణాలు తీర్చగలుగుతారు.

తుల

కీలక  వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు  నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటాబయట సమస్యాత్మక  వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

వృశ్చికం

కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు  సంతృప్తి  కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన   ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా  సాగుతాయి.

ధనస్సు

దైవ  సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత  పెరుగుతుంది. మొండి  బాకీలు వసూలు అవుతాయి.  గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత  మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.  వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఇతరులతో  ఆలోచించి  మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ  కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. 

కుంభం

బంధు మిత్రుల నుండి  ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక  సమస్యలు  కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో  మాటపట్టింపులు కలుగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.

మీనం

చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై  పెద్దల  సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం  చేసుకుంటారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

    #rasiphalalu #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special