పూర్వీకుల ఆస్తి

 


పూర్వీకుల ఆస్తి

పూర్వీకుల ఆస్తి ఎవరు అనుభవించగలుగుతారు లేదా ఎవరు నష్టపోతారు అనేది జ్యోతిష్యం ప్రకారం కచ్చితంగా నిర్ధారించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు బలంగా ఉండడం లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. పూర్వీకుల ఆస్తిని ఏ లగ్న జాతకులకు అయినా పంచమ స్థానము తెలియజేస్తుంది. ఈ స్థానంలో శుభగ్రహాలు స్థితి పొందినప్పుడు పూర్వీకుల ఆస్తుల ద్వారా ఆదాయం పొందగలుగుతారు. పంచమ స్థానంలో రాహు కేతువులు రవి, కుజుడు, శని భగవానుడు, క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్తుల పట్ల ఆశలు వదులుకోవలసినదే. దీనిలో కొద్దిగా మినహాయింపు కలదు పంచమ క్షేత్రంలో ఉన్న పాప గ్రహము ఆ స్థానానికి అధిపతి అయితే ఈ నియమం వర్తించదు. పంచమక్షేత్రంలో రాహువు  ఉన్నప్పుడు కొంతమందిలో పూర్వీకుల ఆస్తి లభిస్తుంది కానీ వీరి కళ్ళముందే వీరి ఆస్తిని కొడుకులు ధ్వంసం చేసేస్తారు. తల్లిదండ్రుల మాట వినని సంతానము లేదా దత్తత తీసుకున్న సంతానము ద్వారా ఈ ఆస్తిని అతి తొందర్లోనే కోల్పోతారు. ఈ నియమానికి కూడా మరొక మినహాయింపు ఉంది పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు దానితో పాటే ఐదు డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో గురువు ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్తి నిలబడుతుంది పుత్ర సంతానం కూడా ఉంటుంది. నైసర్గిక పంచమ స్థానం అయినా సింహరాశిలో రవి తప్ప మిగిలిన పాప గ్రహాలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆస్తి కరిగిపోతుంది. కానీ సింహరాశిలో కుజ గ్రహం ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు. సహజ పంచమ స్థానంలో అనగా సింహరాశిలో శని భగవానుడు ఉన్నప్పుడు తండ్రి నుంచి వచ్చే ఆస్తిలో గొడవలు, కోర్టు కేసులు, అప్పులు ఆర్థికంగా ఒడిదుడుకులు మానసిక చింతన ఏర్పడతాయి. దీనికి కూడా ఒక మీనహాయింపు ఉంది. ఈ శని భగవానునికి గురువు శుక్రుడు బుధుడు లేదా పూర్ణచంద్రుడు ఈ గ్రహాలలో ఏదైనా గ్రహంతో స్థితి ,యుతి,వీక్షణ ఏదైనా ఉన్నప్పుడు పూర్వీకులు నుండి వచ్చే ఆస్తిలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఏ లగ్నానికి అయినా పంచమక్షేత్రంలో పాపగ్రహం ఉన్నప్పటికీ ఆ స్థానం ఆ గ్రహానికి ఉచ్చ క్షేత్రము లేదా స్వక్షేత్రము అయినప్పుడు పూర్వీకుల ఆస్తులు సులభంగా లభిస్తాయి ఈ జాతకులు అనుభవించగలుగుతారు. కొందరి జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉన్నప్పటికీ కొన్ని సులభ మార్గాల ద్వారా పూర్వీకుల ఆస్తులను అనుభవించే అవకాశం ఉంది. అయితే ఆయా గ్రహాలు దశాభుక్తులు ప్రారంభం కాకుండా ముందుగానే కొన్ని సులభ మార్గాల ద్వారా కొన్ని సందర్భాలలో ఆస్తులను కాపాడుకునే అవకాశం ఉంది. జాతక పరిశీలన ద్వారా పూర్వీకుల ఆస్తిని అనుభవించగలమా లేదా అని, మరియు తాను సంపాదించిన ఆస్తిని తమ వారసులకు ఇవ్వగలమా, లేదా తన వారసులు తన ఆస్తిని పెంచుతారా లేదా ధ్వంసం చేస్తారా, లేదా తను సంపాదించిన ఆస్తిని తన వారసులు అనుభవిస్తారా లేదా పరాయి వాళ్ళు అనుభవిస్తారా అనేది జ్యోతిష్యం ద్వారా కచ్చితంగా తెలుసుకోవచ్చు.

ఆర్థిక,ఆరోగ్య,వివాహ,జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special