జ్యేష్ట మాసం విశిష్టత ఏంటో తెలుసా?
జ్యేష్ట మాసం విశిష్టత ఏంటో తెలుసా?
తెలుగు వారు పంచాంగాన్ని నమ్ముతారు. మనకు పన్నెండు రాశులు, 27 నక్షత్రాలు, 6 తెలుగు నెలలు ఉంటాయి. ఇందులో చైత్రం మొదటిది కాగా ఫాల్గుణం ఆఖరుది. ఇందులో చైత్రం, వైశాఖం తరువాత వచ్చేది జ్యేష్టం. ఈ మాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జ్యేష్ట మాసంలో చేసే పూజలకు ప్రత్యేకత ఉంటుంది.
జ్యేష్ట శుద్ధ దశమిని దశపాపహర దశమిగా చెబుతారు. పది రకాల పాపాలను పోగొట్టే దశమిగా భావిస్తారు. ఈ రోజు గంగానదిలో కానీ లేదా ఏదైనా నదిలో కానీ మూడు మునకలు వేయడం ఎంతో పుణ్యం. ఇంకా రజతంతో చేసిన తాబేలు, చేపలు, కప్పలు లాంటి జలచరాల ప్రతిమలు నీళ్లలో వేయడం మంచిది. నల్లనువ్వులు, బెల్లం, పేలపిండి వంటివి నదిలో వేయడం వల్ల పుణ్యం దక్కుతుంది.
జ్యేష్ట శుద్ధ ఏకాదశిని నిర్మల ఏకాదశి అని కూడా పిలుస్తారు. పాయసం, పానకం, గొడుగు, నెయ్యి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. నిర్మల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే 12 ఏకాదశులకు సరిపడా పుణ్యం వస్తుంది. నదిలో స్నానం చేసినా ఇంట్లో స్నానం చేసినా గంగాదేవిని స్మరించి చేయడం వల్ల మంచి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
జ్యేష్ట పౌర్ణమి తరువాత పదమూడో రోజున వటసావిత్రి వ్రతం మహిళలు చేస్తుంటారు. భర్తలు పదికాలాల పాటు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యంతో పది కాలాల పాటు బాగుండాలని ఈ వ్రతం చేస్తుంటారు. ఇలా జ్యేష్ట మాసంలో ఎన్నో రకాల పూజలు చేస్తుంటాం. మనకు పుణ్యం దక్కాలని కోరుకుంటాం. ఇలా మన మాసాల్లో జ్యేష్ట మాసానికి ఉన్న ప్రాధాన్యం అలాంటిది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #jyeshtamasam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments
Post a Comment