రాశిఫలాలు - జూన్ 05 , 2025


 

05-06-2025 గురువారం రాశి ఫలితాలు

మేషం

నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.  ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు.

వృషభం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు  నిర్ణయాలు తీసుకోవడం వలన  నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి.

మిధునం

కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి.  రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన  వ్యవహారాలు  అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన  వాహన యోగం  ఉన్నది. వృత్తి  వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం

ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

సింహం

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నూతన  ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.  వృత్తి వ్యాపారాలు  అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.

కన్య

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర సంబంధిత  విషయమై మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

తుల

నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత  పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

వృశ్చికం

సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ సమర్థతకు  అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు.  మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

మకరం

చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.  చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులు చర్చలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ  ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

కుంభం

ఇంటా  బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు  వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి  సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

మీనం

అవసరానికి  చేతిలో డబ్బు నిలువ ఉండదు.  వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా భాధ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.   నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

    #rasiphalalu #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special