ఓం శ్రీం కామాఖ్య దేవియే నమః
శ్రీ మాత్రే నమః
ఓం శ్రీం కామాఖ్య దేవియే నమః
అత్యంత శక్తివంతమైన ప్రదేశం. అమ్మవారి మహిమకు నిలువెత్తు నిదర్శనం. స్త్రీ తత్వాన్ని, గొప్పదనాన్ని తెలియజేసే అద్భుత క్షేత్రం. అదే కామాఖ్య దేవి ఆలయం. అస్సాంలోని నీలాచల్ కొండపై కొలువుదీరిన ఈ దేవాలయం. కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత ప్రాంతంగా విరాజిల్లుతోంది.
కామాఖ్య దేవి ఆలయం. భారతదేశంలో ఉన్న అత్యంత మహిమాన్విత ప్రదేశాల్లో ఒకటి. అస్సాంలోని గువాహటికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో… నీలాచల్ కొండలపై ఈ గుడి ఉంది.
ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ క్షేత్రం సొంతం. క్రీస్తు శకం 1565లో కోచ్ వంశానికి చెందిన రాజు చిలరాయ్.. కామాఖ్య ఆలయాన్ని పునర్ నిర్మించారని చరిత్ర చెపుతోంది.
కామాఖ్య ఆలయం ఆవిర్భావం వెనుక పురాణగాథ దాగుంది. దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో పరమశివుణ్ణి అవమానపరుస్తాడు. దీంతో, శివుడి భార్య, దక్షుడి కూతురు అయిన సతీదేవి తీవ్రంగా కలత చెందుతుంది. మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకుంటుంది.
ఈ విషయం తెలుసుకున్న ముక్కంటి.. కోపోద్రిక్తుడై అక్కడికి చేరుకుంటాడు. సతీదేవి దేహాన్ని ఎత్తుకుని ప్రళయ తాండవం చేస్తాడు. ఆయన ధాటికి సమస్త విశ్వం అంతమైపోతుందేమోనని అందరూ భయపడతారు.
ఈ పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు 108 భాగాలు 108 ప్రదేశాల్లో పడతాయి. అవే శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి. వాటిలో 51 క్షేత్రాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. అందులో 18 పీఠాలు మరింత విశిష్టతను కలిగి ఉన్నాయి. ఆ శక్తిపీఠాల్లో ఒకటి కామాఖ్య దేవాలయం.
కామం అంటే కోరిక అని అర్థం..! భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవత కాబట్టే ఈ అమ్మవారిని కామాఖ్య అని పిలుస్తారు. శ్రీమహావిష్ణువు సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు.. ఆమె యోని భాగం ఇక్కడ పడింది.
అందుకే కామాఖ్య దేవి.. ఆ రూపంలో కొలువుదీరింది. జీవుల పుట్టుకకు ఆధారమైనది, అత్యంత పవిత్రమైనదిగా భావించే అదే ఆకారంలో పూజలందుకుంటోంది.
ప్రధాన ఆలయంలో ముగ్గురు దేవతలుంటారు. వాళ్లే కామాఖ్య, మాతంగి, త్రిపుర సుందరి. గుడి ప్రాంగణంలో మరో ఏడుగురు అమ్మవార్లు కూడా కనిపిస్తారు. కాళీ, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తా, ధూమవతి, భగళాముఖిగా భక్తులకు దర్శనమిస్తారు.
ఈ పది మందిని దశ మహావిద్యలు అని పిలుస్తారు. ప్రపంచాన్ని శాసించే పది విద్యలకు వీళ్లే ప్రతిరూపమని నమ్ముతారు. అంతేకాదు. ఈ దేవతలకు నవగ్రహాలను అదుపులో పెట్టగలిగే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గ్రహ దోషాలతో బాధపడేవాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు.
ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత.. కామాఖ్య అమ్మవారికి ప్రతి ఏటా జూన్ లో అంటే ఆషాఢ మాసంలో రుతు స్రావం జరుగుతుంది. ఆ సమయంలో మూడు రోజుల పాటు గుడిని మూసేస్తారు.
దానికన్నా ముందుగా ఆలయంలో వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. రుతు స్రావం పూర్తైన తర్వాత నాలుగో రోజు తిరిగి తెరుస్తారు. అంబుబాచీ మేళా అనే పండుగను నిర్వహించి.. రుతు స్రావం సమయంలో కప్పిన వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు పంచుతారు.
ఇక, అమ్మవారి యోని భాగంలో నుంచి వచ్చే నీటిని తీర్థంగా ఇస్తారు. దీన్ని అంగోదకం అని అంటారు. కామాఖ్య ఆలయంలో వామాచారం ప్రకారం పూజలు జరుగుతాయి. జంతు బలులు కూడా ఉంటాయి.
ఎన్నో మహిమలున్న గుడి కాబట్టే ఇక్కడికి ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment